IND vs SL | సెంచరీకి చేరువైన దినుష.. టీ సమయానికి 170 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక..!
IND vs SL : కొలంబో టెస్టులో సొనాల్ దినుష(92నాటౌట్) ఒంటరి పోరాటం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన ఈ కుర్రాడు.. ఐదో రోజూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు.
IND vs SL : కొలంబో టెస్టులో సొనాల్ దినుష(92నాటౌట్) ఒంటరి పోరాటం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన ఈ కుర్రాడు.. ఐదో రోజూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. క్రీజులో పాతుకుపోయిన దినుష.. విలువైన భాగస్వామ్యాలతో లంక ఆధిక్యాన్ని170కి పెంచాడు. అతడి సంకల్పంతో ఆతిథ్య జట్టుకు డ్రాపై ఆశలు చిగురించాయి. దాంతో, టీ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 383 రన్స్ కొట్టింది ఆతిథ్య జట్టు.
ఐదోరోజు శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేసి.. సిరీస్‌ను ఓడిసిపట్టాలనుకున్న భారత జట్టుకు సొమాల్ దినుష(98 నాటౌట్) అడ్డుగోడలా మారాడు. రెండు సెషన్లలోనూ భారత బౌలర్లను నీరసించేలా చేసిన దినుష.. శతకానికి చేరువయ్యాడు. నువాంత(46)తో సెంచరీ భాగస్వామ్యంతో.. ఆపై లహిరు కుమార(2 నాటౌట్)తో కీలక రన్స్ సాధించాడు.
Whole ground rises to applaud Sonal Dinusha for a monumental Day 5 fightback! Batting on 98* at the Tea break, he has anchored the innings under pressure and brought Sri Lanka right back into the contest 🏏🔥
📷: SonyLiv pic.twitter.com/0K3wGEg70r
— CricInformer (@CricInformer) August 27, 2026
లంచ్ తర్వాత మానవ్ సుతార్ ఓవర్లో నువాంత ఔటవ్వడంతో భారతజట్టు ఊపిరి పీల్చుకుంది. కాసేపటికే.. జడేజా బౌలింగ్‌లో వికెట్ ఇచ్చేశాడు. దాంతో.. లంకను చుట్టేయాలనుకున్న టీమిండియా స్పిన్నర్లు, పేసర్లను దీటుగా ఎదుర్కొన్నాడు దినుష ఆలౌట్ ప్రమాదంలో పడినందున కుమార, దినుష ద్వయం ఏకంగా 99 బంతులు ఎదుర్కొని.. 22 రన్స్ రాబట్టారంతే. తొలి ఇన్నింగ్స్‌లో (103 రన్స్‌తో మెరిసిన దినుష.. పట్టుదలతో 329/6 తో భోజన విరమానికి వెళ్లిన లంక.. 383/8తో రెండో సెషన్‌ను ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

