Wimbledon | వింబుల్డన్ టోర్నీ.. క్వార్టర్స్‌కు అల్కారజ్, సిన్నర్
డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్ వింబుల్డన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ స్పెయిన్ కుర్రాడు 6-3, 6-4, 1-6, 7-5తో ఉగొ హంబర్ట్ (ఫ్రెంచ్)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్ చేరాడు.
Wimbledon | లండన్: డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కారజ్ వింబుల్డన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ స్పెయిన్ కుర్రాడు 6-3, 6-4, 1-6, 7-5తో ఉగొ హంబర్ట్ (ఫ్రెంచ్)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్లో టియోఫితో కష్టపడి నెగ్గిన అల్కారజ్‌కు ప్రిక్వార్టర్స్‌లో మాత్రం విజయం నల్లేరు మీద నడకలా సాగింది. మ్యాచ్‌లో 14 ఏస్‌లు సంధించిన అతడు.. 45 విన్నర్లు కొట్టి 6 డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
మరో మ్యాచ్‌లో ఒకటో సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) 6-2, 6-4, 7-6 (11/9)తో బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. కాగా మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ 6-3, 1-6, 2-6తో అన్‌సీడెడ్ యులియా పుటిన్సెవా (కజకిస్థాన్) చేతిలో ఓడి మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. ఏడో సీడ్ జాస్మిన్ పలోని (ఇటలీ) 6-3, 6-7 (6/8), 5-5 తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచి తన తొలి వింబుల్డన్ క్వార్టర్స్ చేరుకుంది. మూడో సెట్లో కీస్ కాలికి గాయమవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకోవడంతో పలోని ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

