Deepak Chahar | చాహర్ భార్యకు చంపేస్తామంటూ బెదిరింపులు..!
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సదరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు.
Deepak Chahar | టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సదరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై చాహర్ తండ్రి లోకేంద్ర చాహర్ ఆగ్రా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వ్యాపారం కోసం అని చెప్పి రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పకేర్.. జయ భరద్వాజ్ వద్ద 2022 అక్టోబర్ 7న రూ.10లక్షలు అప్పుగా తీసుకున్నారు. అనంతరం డబ్బును వారు దుర్వినియోగం చేశారని తెలుసుకున్న భరద్వాజ్.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే, డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సదరు వ్యక్తులు తన కోడలిని చంపేస్తామని బెదిరించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని చాహర్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

