SA vs ENG | ఇంగ్లండుకు భారీ షాక్.. సఫారీల గ్రాండ్ విక్టరీ
SA vs ENG | గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే సఫారీలు ఇంగ్లీష్ జట్టుకు మరో భారీ షాకిచ్చారు. ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో అన్నిరంగాలలో రాణించిన సఫారీలు.. బట్లర్ గ్యాంగ్‌ను చావుదెబ్బకొట్టారు.
SA vs ENG | వన్డే వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మరోభారీ షాక్ తప్పలేదు. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే సఫారీలు ఇంగ్లీష్ జట్టుకు మరో భారీ షాకిచ్చారు. ముంబైలోని వాంఖెడే వేదికగా ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో అన్నిరంగాలలో రాణించిన సఫారీలు.. బట్లర్ గ్యాంగ్‌ను చావుదెబ్బకొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్.. 22 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సఫారీలు 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా మూడో స్థానానికి చేరగా ఇంగ్లండ్ 9వ స్థానానికి పడిపోయింది.
భారీ లక్ష్య ఛేదనలో మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఏ దశలోనూ పుంజుకోలేదు. సఫారీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి డిఫెండింగ్ ఛాంపియన్లు ఊపిరితీసుకోనీయకుండా చేశారు. బెయిర్ స్టో (10)తో పాటు జో రూట్ (2) డేవిడ్ మలన్ (6), బెన్ స్టోక్స్ (5) లు నిరాశపరిచారు. రబాడా వేసిన అదే ఓవర్లో 4, 6 బాదడంతో ఇంగ్లండ్ స్కోరు 50 పరుగులకు చేరింది. కొయెట్జ్ వేసిన పదో ఓవర్లో బట్లర్ ( .. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కానీ అతడే వేసిన 12వ ఓవర్లో బట్లర్.. డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో మూడో బంతికి హ్యారీ బ్రూక్ (17) కూడా ఔటయ్యాడు. అదిల్ రషీద్ (10)ను కోయెట్జ్ .. 15వ ఓవర్లో తొలి బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
వుడ్ దంచుడు..
101 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మార్క్ వుడ్ (17 బంతుల్లో 43 నాటౌట్, 2 ఫోర్లు, 5 సిక్సర్లు).. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో వుడ్.. రెండు సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టాడు. వుడ్‌తో పాటు రబాడా వేసిన 21వ ఓవర్లో అట్కిన్సన్ (21 బంతుల్లో 35, 7 ఫోర్లు).. నాలుగు బౌండరీలు బాదాడు. కేశవ్ మహారాజ్ వేసిన 22వ ఓవర్లో మార్క్ వుడ్ ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లు కొట్టినా అదే ఓవర్లో అట్కిన్సన్ను మహారాజ్ బౌల్డ్ చేశాడు. సఫారీ చివరి వరుస బ్యాటర్ రీస్ టాప్లీ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేదు. దీంతో ఇంగ్లండ్.. 170 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా 229 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

