SA vs ENG | సఫారీలదే బ్యాటింగ్.. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్, డసెన్
SA vs ENG | ముంబై వేదికగా సౌతాఫ్రికా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 20వ వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ సేన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
SA vs ENG | ముంబై వేదికగా సౌతాఫ్రికా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 20వ వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ సేన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ట్రోఫీ అందించిన హీరో బెన్ స్టోక్స్ తాజా వరల్డ్ కప్‌లో తొలిసారి బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన బట్లర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై లోని వాంఖెడే పిచ్ ఛేదనకు అనుకూలంగా ఉంటుంది. కాగా సఫారీ జట్టులో రెగ్యులర్ సారథి టెంబ బవుమా జ్వరంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. బవుమా ప్లేస్‌లో రీజా హెండ్రిక్స్ తుదిజట్టులోకి వచ్చాడు.
ఆట ఆరంభమైన రెండో బంతికే సఫారీలకు భారీ షాక్ తాకింది. రీస్ టాప్లీ వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన డికాక్.. రెండో బంతికి మాత్రం వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. డికాక్ నిష్క్రమణ తర్వాత వచ్చిన రస్సీ వాన్ డెర్ డసెన్.. హెండ్రిక్స్‌తో కలిసి సఫారీ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
తొలుత ఇంగ్లాండ్ పేసర్లు చెలరేగడంతో సఫారీలు 50 పరుగులు చేసేందుకు పది ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. డేవిడ్ విల్లే వేసిన పదో ఓవర్లో రెండు బంతులను బౌండరీకి తరలించిన హెండ్రిక్స్.. సఫారీల స్కోరువేగాన్ని పెంచాడు. 16 ఓవర్ల ఆట ముగిసేసమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (50), డసెన్ (50) లు అర్థ సెంచరీలు పూర్తిచేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

