AUS vs PAK | వార్నర్, మార్ష్ శతకాల హోరు.. పాక్ బేజారు
AUS vs PAK | పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు సెంచరీలతో కదం తొక్కారు.
AUS vs PAK | పాకిస్తాన్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లు సెంచరీలతో కదం తొక్కారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు భారీ స్కోరు అందించే దిశగా వీరబాదదుడు బాదుతున్న ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా రెండు వందల పరుగులు జోడించి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న వార్నర్ అదే దూకుడును కొనసాగిస్తూ పాకిస్తా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి పవర్ ప్లే తర్వాత బౌండరీలతో పాటు వికెట్ల మధ్య పరిగెగ్తుతూ సెంచరీకి చేరువయ్యాడు. నవాజ్ వేసిన 30వ ఓవర్ నాలుగో బంతికి లాంగాన్ దిశగా సింగిల్ తీసి సెంచరీ పూర్తిచేశాడు. 85 బంతుల్లోనే ఏడు బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో వార్నర్ శతక్కొట్టాడు.
ఇక 46 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మార్ష్ ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. హసన్ అలీ వేసిన 28వ ఓవర్లో సిక్సర్ కొట్టి 80లలోకి వచ్చిన అతడు.. అతడే వేసిన మరుసటి వర్లో స్ట్రైయిట్ సిక్స్‌తో 90లలోకి వచ్చాడు. వార్నర్ సెంచరీ చేసిన మరుసటి బంతిని బౌండరీకి తరలించి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇవాళ మిచెల్ మార్ష్ బర్త్ డే కావడం గమనార్హం. ఇక వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. అంతకుముందు ఆ జట్టు 2011లో కెనడాపై షేన్ వాట్సన్, బ్రాడ్ హగిన్ లు తొలి వికెట్ కు 183 పరుగులు జోడించారు. ఇదే వేదికపై వాట్సన్, హగిన్లు సృష్టించిన రికార్డును తాజాగా వార్నర్, మార్ష్ బ్రేక్ చేయడం విశేషం. 31 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ ఆసీస్.. వికెట్లేమీ నష్టపోకుండా 222 పరుగులు చేసింది. వార్నర్ (105 బ్యాటింగ్), మార్ష్ (108 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

