AUS vs PAK | ధీటుగా బదులిస్తున్న పాకిస్తాన్.. లక్ష్యం దిశగా సాగుతున్న బాబర్ సేన
AUS vs PAK | ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తోంది.
AUS vs PAK | ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభారంభం అందించడంతో పాక్ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 28 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 28 ఓవర్ల ఆట ముగిసేసరికి సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ లు క్రీజులో ఉన్నారు.
భారీ లక్ష్య ఛేదనలో భాగంగా స్టార్క్ వేసిన మూడో ఓవర్లో అబ్దుల్లా షఫీక్ (64) రెండు బౌండరీలు బాదాడు. హెజిల్వుడ్ వేసిన నాలుగో ఓవర్లో ఇమామ్ ఉల్ హక్ (70) బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టాడు. స్టార్క్ వేసిన తర్వాతి ఓవర్లో ఇమామ్ అదే సీన్ రిపీట్ చేశాడు. కమిన్స్ వేసిన 11వ ఓవర్లో షఫీక్ 4, 6 బాదడంతో పాకిస్తాన్ స్కోరుబోర్డులో వేగం పెరిగింది. 15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది.
54 బంతుల్లో ఇమామ్ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జంపా వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి నాలుగో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. షఫీక్ అర్థ సెంచరీతో ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు నలుగురు అర్థ సెంచరీలు సాధించడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్, మార్ష్‌లు కూడా ఫిఫ్టీలు చేశారు.
తొలి వికెట్‌కు పాక్ ఓపెనర్లు 21 ఓవర్లలో 134 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కమిన్స్.. స్టోయినిస్‌కు బంతినిచ్చాడు. స్టోయినిస్ వేసిన 22వ మొదటి బంతికే.. షఫీక్ మ్యాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. దీంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. తన తర్వాతి ఓవర్లో స్టోయినిస్ పాకిస్తాన్ ను మరో దెబ్బకొట్టాడు. 23వ ఓవర్లో నాలుగో బంతికి ఇమామ్ ను పెవిలియన్ కు పంపాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడ్డ పాకిస్తాన్ ఒత్తిడికి లోనైంది. ఆడమ్ జంపా వేసిన 26వ ఓవర్లో రెండో బంతికి బాబర్ ఆజమ్ (18) కూడా కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

