Cricket Australia | గిల్ ఔటైన బంతి ఒక మాస్టర్ పీస్.. ట్వీట్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
Cricket Australia : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌటయ్యాక భారత్ తొలి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. కానీ, స్కాట్ బోలాండ్(Scott Boland) ఒక అద్భుత బంతితో ఫామ్‌లో ఉన్నశుభ్మన్ గిల్(13) బౌల్డ్ చేశాడు. ఆ బంతిని క్రికెట్ ఆస్ట్రేలియా 'మాస్టర్‌పీస్'గా...
Cricket Australia : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌటయ్యాక భారత్ తొలి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. కానీ, స్కాట్ బోలాండ్(Scott Boland) ఒక అద్భుత బంతితో ఫామ్‌లో ఉన్నశుభ్మన్ గిల్(13) బౌల్డ్ చేశాడు. ఆ బంతిని క్రికెట్ ఆస్ట్రేలియా ‘మాస్టర్‌పీస్’గా అభివర్ణించింది. బోలాండ్ వేసిన ఆ డెలివరీ ఎంతంగా టర్న్ అయిందో తెలిపే ఫొటోను ట్విట్టర్లో పెట్టింది.
బోలాండ్ వేసిన సూపర్ బాల్‌కు బౌల్డ్ అయిన గిల్‌కు ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియలేదు. ఆ బంతి వికెట్ల వైపు రాదు అనుకున్న అతడు దానిని వదిలేశాడు. అనూహ్యంగా టర్న్ అయిన బాల్ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో, బోలాండ్ సహా ఆసీస్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. అంతకుముందు ఓవర్లోనే కమిన్స్ డేంజరస్ రోహిత్ శర్మ(15) వెనక్కి పంపాడు. దాంతో, 30 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Masterpiece 👌#WTCFinal pic.twitter.com/6skbxI48P6
— cricket.com.au (@cricketcomau) June 8, 2023
దంచికొట్టిన హెడ్, స్మిత్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలిరోజు విఫలమైన భారత బౌలర్లు రెండో రోజు విజృంభించారు. పేసర్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్469 పరుగుల వద్ద ముగిసింది. సిరాజ్ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్(9) భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే చేతికి చిక్కాడు. దాంతో, ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సంచలన ఆటతో ఆసీస్ భారీ స్కోర్‌కు బాటలు వేశారు. చివర్లో అలెక్స్ క్యారీ (48) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 450 దాటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

