Cheteshwar Pujara | ఇంగ్లండ్లో కెప్టెన్గా పుజారా..
టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా ఇంగ్లండ్ లో సారథిగా నియమితుడయ్యాడు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ముందే అక్కడికి వెళ్లిన పుజారా.. రీషెడ్యూల్డ్ టెస్టు ముగిశాక కూడా అక్కడే ఉన్నాడు. ఇంగ్లీష్ గడ్డ మీద కౌంటీలు ఆడుతున్న పుజారా.. ప్రస్తుతం Sussex తరఫున బరిలోకి దిగుతున్నాడు. కాగా ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ టామ్ హేన్స్ కు గాయం కావడంతో ససెక్స్ కు పుజారా తాత్కాలిక సారథిగా నియమితుడయ్యాడు.
కౌంటీలలో భాగంగా నేటి నుంచి ససెక్స్ జట్టు.. Middlesex తో లార్డ్స్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. అయితే గతవారం లీస్టర్షైర్ తో మ్యాచ్ ఆడుతూ హేన్స్ గాయపడటంతో పుజారాకు ఈ అవకాశం దక్కింది.
ఇదే విషయమై ససెక్స్ హెడ్ కోచ్ ఇయాన్ సలిస్బురి మాట్లాడుతూ.. పుజారాలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. టామ్ హేన్స్ లేని లోటును అతడు భర్తీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పుజారా అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇయాన్ తెలిపాడు.
ఈ సీజన్ లో పుజారా ససెక్స్ తరఫున అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్నాడు. సమ్మర్ సీజన్ లో ససెక్స్ కు ఆరు మ్యాచులు ఆడిన పుజారా.. 110 సగటుతో 766 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు (ఒక డబుల్ సెంచరీ కూడా) ఉన్నాయి. ఈ సీజన్ లో షాన్ మసూద్ (1,074), వేన్ మ్యాడ్సెన్ (875) తర్వాత పుజారా అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు.
Following the news of Tom Haines’ injury, Cheteshwar Pujara has been named as interim captain. ©
Good luck to @cheteshwar1 and the team. 👏 #GOSBTS
— Sussex Cricket (@SussexCCC) July 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

