Cheteshwar Pujara | హమ్మయ్య.. ఐపీఎల్ ఆడనందుకు నేను హ్యాపీ.. పుజారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Cheteshwar Pujara | టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా స్వల్ప విరామం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. కౌంటీలలో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న అతడు ఇంగ్లాండ్‌తో టెస్టు ఆడనున్నాడు.
ఐపీఎల్ అంటేనే కాసుల పంట. ఈ లీగ్‌లో రెండు మూడు సీజన్లు ఆడినా లైఫ్ సెట్ అవుద్దని భావిస్తుంటారు క్రికెటర్లు. ఇక ఒక సీజన్లో అదరగొడితే వాళ్లకు తర్వాత సీజన్ వేలానికి కోట్లలో ధర పలుకుతుంది. అంతటి క్యాష్ రిచ్ లీగ్‌లో ఎలాగైనా మెరవాలని, జీవితాలు సెట్ చేసుకోవాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటారు.
కానీ టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఐపీఎల్ ఆడకపోవడమే తనకు మంచిదైందని అతడు అంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు తన కౌంటీ ప్రదర్శన, టీమిండియాలోకి తిరిగి ఎంపికవడంపై నయావాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పుజారా మాట్లాడుతూ.. ‘మీరు ఒకటి ఆలోచించండి. ఒకవేళ ఐపీఎల్లో నన్ను ఏదైనా జట్టు దక్కించుకుంటే నేను తుదిజట్టులో ఉంటానా..? అసలు నాకు ఆడే అవకాశం ఇస్తారా..? మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం తప్ప నాకు అక్కడ ఏమీ ఉండదు. కానీ నేను కౌంటీలు ఆడితే నాకు ఇక్కడ నెట్ ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. నెట్ ప్రాక్టీస్ కంటే మ్యాచ్ ప్రాక్టీస్ ఎంతో బెటర్ కదా…
అందుకే నాకు కౌంటీలలో ఆడే అవకాశం వచ్చినప్పుడు నో చెప్పాలనిపించలేదు. ఇక్కడికొచ్చి నన్ను నేను నిరూపించుకొని తిరిగి జట్టులోకి రావాలనే ఆలోచనతో నేను కౌంటీలు ఆడలేదు. నేను కోల్పోయిన రిథమ్‌ను తిరిగి పొందడానికే ఇక్కడికి వచ్చాను’ అని అన్నాడు.
అంతేగాక.. ‘నేను ఇక్కడికి రావడమే పాజిటివ్ దృక్పథంతో వచ్చాను. అందులో సందేహమే లేదు. నేను తిరిగి భారత జట్టులో భాగమౌతాననే నమ్మకముంది. కానీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం మాత్రం నేను ఆడలేదు. ఒక మంచి ఇన్నింగ్స్ పడితే నేను తిరిగి పాత లయను అందుకుంటానని నమ్మకం నాకుంది..’ అని చెప్పాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఐపీఎల్ వేలంలో పుజారాను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. అదీగాక కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్న అతడిని శ్రీలంకతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో పుజారా.. ఐపీఎల్-15 ప్రారంభమయ్యాక ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీలు ఆడుతున్నాడు.
కౌంటీలలో ససెక్స్ తరఫున ఆడుతున్న ఈ నయావాల్.. ఐదు మ్యాచులలో ఏకంగా 720 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు (రెండు డబుల్ సెంచరీలు) ఉన్నాయి. కౌంటీలలో అదరగొట్టడంతో సెలెక్టర్లు పుజారాను తిరిగి భారత టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

