National Sports Awards 2023: షమీకి అర్జున, సాత్విక్-చిరాగ్ జోడీకి ఖేల్ రత్న.. జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన
National Sports Awards 2023: 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం ఈ అవార్డుల జాబితాను వెల్లడించింది.
National Sports Awards 2023: దేశంలో క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం ఈ అవార్డుల జాబితాను వెల్లడించింది. క్రీడాకారులకు అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న -2023 అవార్డు భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు దక్కింది. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డును ప్రకటించిన కేంద్రం అతడితో పాటు మరో 25 మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ కూడా అర్జున అవార్డు పొందిన జాబితాలో ఉన్నాడు.
అర్జున గ్రహీతలు..
అర్జున అవార్డు పొందినవారిలో ఆర్చరీ నుంచి ఇద్దరు (ఒజాస్ ప్రవీణ్, అదితి గోపీచంద్ స్వామి), అథ్లెటిక్స్ నుంచి (శ్రీశంకర్, పారుల్ చౌదరి), బాక్సింగ్ నుంచి (మహ్మద్ హుసాముద్దీన్), చెస్ క్రీడాకారిణి వైశాలి, ఈక్వెస్ట్రియన్ ప్లేయర్ దివ్యకృతి సింగ్, గోల్ఫ్ నుంచి దీక్షా దగర్‌లు ఉన్నారు. హాకీ క్రీడాకారులు కృష్ణ బహదూర్, సుశీలా చానులు, కబడ్డీ ప్లేయర్స్ పవన్ కుమార్, రితూ నేగీ, ఖో ఖో క్రీడాకరుడు నస్రీన్ కూడా అర్జున పొందారు. లాన్ బౌల్స్ నుంచి పింకి, షూటింగ్ క్రీడాకారులు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్,ఈశా సింగ్, స్క్వాష్ నుంచి హరిందర్ పాల్ సింగ్ సంధూ, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అహ్యిక ముఖర్జీ, రెజ్లింగ్ యోధులు అంతిమ్ పంగల్, నరోమ్ రోషిబినా దేవిలు కూడా అర్జున గ్రహీతలుగా ఉన్నారు. పారా అర్చరీ నుంచి శీతల్ దేవి, అంధుల క్రికెట్ నుంచి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, పారా కనోయింగ్ ఆడుతున్న ప్రాచి యాదవ్‌లకు అర్జున దక్కాయి.
ద్రోణాచార్యులు వీళ్లే..
లలిత్ కుమార్ – రెజ్లింగ్
ఆర్.బి. రమేశ్ – చెస్
మహవీర్ ప్రసాద్ సైని – పారా అథ్లెటిక్స్
శివేంద్ర సింగ్ – హాకీ
గణేష్ ప్రభాకర్ – మల్లఖంబ్
ద్రోణాచార్య అవార్డులలో అందజేసే లైఫ్ టైమ్ కేటగిరీ అవార్డులలో గోల్ఫ్ కోచ్ జస్క్రిత్ సింగ్ గ్రెవాల్, కబడ్డీ కోచ్ భాస్కరన్, టేబుల్ టెన్నిస్ కోచ్ జయంత కుమార్ పుషిలాల్ ఉన్నారు.
ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు..
మంజూష కన్వర్ – బ్యాడ్మింటన్
వినీత్ కుమార్ శర్మ – హాకీ
కవితా సెల్వరాజ్ – కబడ్డీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

