Norway Chess : నార్వే చెస్ టోర్నీలో తొలిరోజే సంచలనం నమోదైంది. ఫేవరెట్ ఆటగాడైన వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlson)కు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి రౌండ్లోనే అలిరెజా ఫిరౌజా చేతిలో కార్ల్సన్ పరాజయం పాలయ్యాడు. ప్రపంచ ఛాంపియన్ డి.గుకేశ్(D Gukesh) మారథాన్ పోరులో డ్రాతో గట్టెక్కగా, భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద(R Praggnandhaa) అద్భుత పోరాట పటిమతో శుభారంభం చేశాడు. మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ ధాటికి ఛాంపియన్ జు వెంజున్ చేతులెత్తేసింది.
నార్వే చెస్ తొలి రౌండ్లో భారత కుర్రాడు గుకేశ్‌కు విన్సెంట్ కెయ్మెర్(జర్మనీ) నుంచి గట్టిపోటీ ఎదురైంది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి 144 ఎత్తులు వేయడంతో గుకేశ్ చెమటోడ్చక తప్పలేదు. ట్రై బ్రేకర్‌లో పుంజుకున్న భారత స్టార్ 1.5 పాయింట్లు సాధించాడు. పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
🇮🇳 The World Champion, Gukesh D, beats Vincent Keymer in Armageddon, after a very dramatic classical game 🔥🔥 #NorwayChess pic.twitter.com/yuJQLh8SES
— Norway Chess (@NorwayChess) May 25, 2026
ప్రజ్ఞానంద సైతం ట్రై బ్రేకర్‌లోనే వెస్లేను చిత్తు చేశాడు. ఎదురుదాడి వ్యూహంతో ఆడిన భారత గ్రాండ్‌మాస్టర్ 1.5 పాయింట్లతో గుకేశ్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ సంచలన ఆటతో ఛాంపియన్ జు వెంజున్కు చెక్ పెట్టింది. ట్రై బ్రేకర్‌లో జోరు చూపించి విజేతగా నిలిచింది.
QUEEN BLUNDER 🤯
Women’s World Champion Ju Wenjun blunders her queen in an insane Armageddon time scramble and instantly resigns 💥#NorwayChess pic.twitter.com/WOO999PQoH
— Norway Chess (@NorwayChess) May 26, 2026