న్యూయార్క్ : డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అమ్మాయిల వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకా కూడా అలవోక విజయంతో టోర్నీలో ముందంజ వేసింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ అల్కరాజ్ 4-6, 6-0, 6-3, 6-2తో పోర్చుగల్ ఆటగాడు జామే ఫరియాపై విజయం సాధించాడు. గ్రాండ్ సామ్స్లో తనకు ఇది వరుసగా 16వ విజయం కావడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6-2, 6-2, 6-4తో గ్వెరీరి (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-1, 6-3, 7-2తో జార్జ్నీ (అమెరికా)పై గెలిచారు. 8వ సీడ్ షెల్టన్ 6-3, 5-7, 7-6 (3), 7-5తో హుర్కాజ్పై కష్టపడి నెగ్గాడు. 11వ సీడ్ తియఫో (అమెరికా) 6-3, 7-6 (7/2), 7-5తో జపాన్ ప్లేయర్ సకమోటోపై గెలవగా.. టామీ పాల్, బబ్లిక్ సిట్సిపాస్, షెపవలోవ్ కూడా ముందంజ వేశారు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 6-1, 6-1తో రష్యాకు చెందిన యాట్సెంకోను 53 నిమిషాల్లోనే చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో పెగులా (అమెరికా) 6-3, 6-1తో తోటి ప్లేయర్ సోఫియా కేనిన్ను ఓడించి మూడో రౌండ్లో అడుగు పెట్టింది. ఆరో సీడ్ నొస్కోవా (చెక్) 6-4, 6-2తో టరార్డీని, ఏడో సీడ్ ముచోవా 6-1, 6-0తో కేటీ బౌల్టర్ని, తొమ్మిదో సీడ్ స్వితోలినా 6-2, 6-7 (6/8), 6-4తో జాయింట్‌ను ఓడించగా.. 11వ సీడ్ కోస్త్యుక్ 6-1, 7-5తో స్లోన్ స్టీఫెన్స్‌పై విజయం సాధించింది.