బ్రూక్ రికార్డు డబుల్
కెప్టెన్ హ్యారీ బ్రూక్ (202) వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో పాటు ఈ ఫార్మాట్లో ద్విశతకం కొట్టిన ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ టీమ్‌ను ఓడించి ఔరా అనిపించింది.
- అయినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
రావల్పిండి: కెప్టెన్ హ్యారీ బ్రూక్ (202) వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో పాటు ఈ ఫార్మాట్లో ద్విశతకం కొట్టిన ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ టీమ్‌ను ఓడించి ఔరా అనిపించింది.
430 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే అందుకొని వన్డేల్లో రెండో అత్యధిక ఛేదనతో రికార్డుకెక్కింది. పవన్ రత్నాయకే (130), అవిష్క (97), షనక (97)తో పాటు చివర్లో లియానగే (27 బంతుల్లో 61 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో లంకను గెలిపించారు. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 429/4 స్కోరు చేసింది. 114 బంతుల్లో ద్విశతకానికి చేరిన బ్రూక్ గత నెల వెస్టిండీస్‌పై భారత సారథి శుభ్‌మన్ గిల్ 117 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Double Century
- harry brook
- odi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

