మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ తన సత్తా మరోసారి చాటాడు. చాన్నాళ్ల క్రితమే రిటైర్ అయిన అతను.. ఇంకా తన బౌలింగ్‌లో వేగం తగ్గలేదని నిరూపించాడు. కానీ ఈసారి మైదానంలో కాదు.. తన ఇంటి పెరట్లో తన పవర్ ఏంటో చూపాడు. 15 ఏళ్ల కొడుకు ప్రెస్టన్ లీతో క్రికెట్ ఆడిన బ్రెట్ లీ.. తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. మెరుపు వేగంతో బౌలింగ్ వేసిన బ్రెల్ లీ.. తన కుమారుడు ప్రిస్టన్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను బ్రెట్ లీ సోదరడు షేన్ లీ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.