FIFA Worldcup: బ్రెజిల్‌పై స్టన్నింగ్ విక్టరీ.. నార్వేను గెలిపించిన హాలాండ్
FIFA Worldcup: ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనం నమోదు అయ్యింది. అయిదు సార్లు ప్రపంచకప్ విజేత బ్రెజిల్‌కు నార్వే షాకిచ్చింది. న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో నార్వే విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నార్వే స్ట్రయికర్ హాలాండ్ రెండో గోల్స్ చేశాడు.
న్యూజెర్సీ: ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనం నమోదు అయ్యింది. అయిదు సార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్.. రౌండ్16లో ఓటమి పాలైంది. న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో నార్వే విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో నార్వే క్వార్టర్స్‌కు ప్రవేశించడం ఇదే మొదటిసారి. స్టార్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ అద్భుతమైన గేమ్‌తో ఆకట్టుకున్నాడు. అతను రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
1990 వరల్డ్‌కప్ తర్వాత రౌండ్16లో బ్రెజిల్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న హాలాండ్ మరోసారి అదే దూకుడు ప్రదర్శించాడు. టోర్నమెంట్లో ఆరు, ఏడవ గోల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే టోర్నీలో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాప్పే, మెస్సీతో సమంగా హాలాండ్ నిలిచాడు. 25 ఏళ్ల ఆ స్ట్రయికర్ మరో కీలకమైన మైలురాయి చేరుకున్నాడు. నార్వే తరపున 54 మ్యాచుల్లో 62 గోల్స్ చేశాడు. నార్వే తరపున ఆడిన చివరి 14 మ్యాచుల్లో హాలాండ్ మొత్తం 27 గోల్స్ చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో హాలాండ్ 79, 90వ నిమిషాల్లో రెండు గోల్స్ చేశాడు. ఇక బ్రెజిల్ తరపున నేమార్ 90 నిమిషంలో గోల్ చేశాడు. వాస్తవానికి ఆరంభంలో బ్రెజిల్‌కు పెనాల్టీ దొరికింది. కానీ నార్వే గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా సేవ్ చేయడంతో.. గోల్ చేసే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది. దాదాపు రెండో అర్థ భాగం చివరి దశ వరకు రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. జూలై 11వ తేదీన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో నార్వే తలపడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

