IPL 2023 | స్లో పిచ్‌పై అదరగొట్టిన ఆర్సీబీ.. లక్నోపై ప్రతీకార విజయం
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో కొట్టింది తక్కువ స్కోరే.. అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. బలమైన లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై బౌలర్లు చెలరేగడంతో లక్నోను 108కే ఆలౌట్ చేసింది. దాంతో, ఐదో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది.
IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో కొట్టింది తక్కువ స్కోరే.. అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. బలమైన లక్నో సూపర్ జెయింట్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై బౌలర్లు చెలరేగడంతో లక్నోను 108కే ఆలౌట్ చేసింది. దాంతో, ఐదో విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది.
20వ ఓవర్లో లక్నో విజయానికి 23 రన్స్ కావాలి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, లక్నో 108 రన్స్‌కు ఆలౌటయ్యింది. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు. దాంతో, ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి ఓవర్లోనే షాక్. ఇన్నింగ్స్ రెండో బంతికే సిరాజ్ డేంజరస్ కైల్ మేయర్స్(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(14)ను మ్యాక్స్‌వెల్ పెవిలియన్ పంపాడు. హేజిల్‌వుడ్ ఓవర్లో కోహ్లీ అద్భుత క్యాచ్‌తో ఆయూష్ బదోని(4) ఔటయ్యాడు. ఆ తర్వాత లక్నో వికెట్ల పతనం మొదలైంది. పూరన్(9), స్టోయినిస్(13) త్వరగానే పెవిలియన్ చేరారు. కృష్ణప్ప గౌతమ్(23) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆఖర్లో అమిత్ మిశ్రా(19), నవీల్ ఉల్ హక్(13) పోరాడారు. పదో వికెట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు.
స్పిన్ ఉచ్చులో ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు స్పిన్ ఉచ్చులో పడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ల ధాటికి ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కొట్టలేకపోయారు. కెప్టెన్ డూప్లెసిస్(44), విరాట్ కోహ్లీ(31) మాత్రమే రాణించారు. దినేశ్ కార్తిక్(16), అనుజ్ రావత్(9), మ్యాక్స్‌వెల్(4) విఫలయ్యారు. దాంతో,ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్‌కు ఒక వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

