Ben Stokes | సిరీస్‌లో తొలి ఓవర్.. మొదటి బంతికే హిట్‌మ్యాన్ బౌల్డ్.. వీడియో
Ben Stokes : భారత పర్యటనలో ఇప్పటివరకూ బౌలింగ్ చేయని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ధర్మశాలలో బంతి అందుకున్నాడు. కుర్ర స్పిన్నర్లు, ప్రధాన పేసర్లు జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ తేలిపోవడంతో...
Ben Stokes : భారత పర్యటనలో ఇప్పటివరకూ బౌలింగ్ చేయని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ధర్మశాలలో బంతి అందుకున్నాడు. కుర్ర స్పిన్నర్లు, ప్రధాన పేసర్లు జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ తేలిపోవడంతో బౌలింగ్‌కు సిద్దమయ్యాడు. లంచ్ తర్వాత రెండో ఓవర్ వేసిన అతడు తొలి బంతికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ(103)ను బౌల్డ్ చేశాడు.
స్టోక్స్ వేసిన ఔట్ స్వింగర్ హిట్‌మ్యాన్ ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. దాంతో, ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. రోహిత్ వెనుదిరగడంతో పడడంతో 275 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆర్వాత అండర్సన్ ఇక తన వంతు అంటూ శుభ్‌మన్ గిల్(110)ను బౌల్డ్ చేసి వెనక్కి పంపాడు.
𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl
— JioCinema (@JioCinema) March 8, 2024
వన్డే వరల్డ్ కప్ తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. భారత పర్యటనలోపు కోలుకున్నాడు. అయితే.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే అతడు నాలుగు టెస్టుల్లోనూ ఆడాడు. అయితే.. ధర్మశాల టెస్టుకు ముందు స్టోక్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే ఐదో టెస్టులో స్టోక్స్ మ్యాజిక్ చేశాడు. తొలి బంతికే డేంజరస్ రోహిత్ శర్మను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు.
300 up for #TeamIndia! 👍 👍
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UA4yfk0ydM
— BCCI (@BCCI) March 8, 2024
ప్రస్తుతం కుర్రాళ్లు దేవ్‌దత్ పడిక్కల్(31), సర్ఫరాజ్ ఖాన్()లు ఆచితూచి ఆడుతున్నారు. దాంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసి.. 97 రన్స్ ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Maha Shivaratri | బ్రహ్మ, విష్ణువు మధ్య గొడవకు మహాశివరాత్రికి సంబంధమేంటి? అసలు శివలింగం ఎలా ఉద్భవించింది?
- Gangs of Godavari | ఉమెన్స్ డే స్పెషల్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఊరమాస్ పోస్టర్ రిలీజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

