IPL 2024 | జాసన్ రాయ్ ఔట్.. కేకేఆర్ జట్టులోకి విధ్వంసకర బ్యాట్స్‌మెన్..
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024కు సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానున్నది. పొట్టి క్రికెట్ లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో కీలక మార్పు చేసింది. జాసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకున్నది.
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024కు సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానున్నది. పొట్టి క్రికెట్ లీగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో కీలక మార్పు చేసింది. జాసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకున్నది. జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ ఆటగాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే జట్టుకు చెందిన ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్ రూ.1.5కోట్ల రిజర్వ్ ధరకు తీసుకున్నది.
ఫిల్ స్టాల్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుతున్నది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో స్టాల్ అమ్ముడవలేదు. ప్రస్తుతం జాసన్ రాయ్ స్థానంలో ఫిల్ సాట్ల్ను కేకేఆర్ తీసుకున్నది. ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఫిల్ సాల్ట్ 163.91 సగటుతో 218 పరుగులు సాధించాడు. సీజన్లో అత్యధిక సోర్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 87. ఈ యువ క్రికెటర్ ఇంగ్లండ్ తరఫున 21 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడి.. 639 పరుగులు చేశాడు.
ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. జాసన్ రాయ్ 2023 సీజన్లో షకీబ్ అల్ హసన్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎనిమిది మ్యాచుల్లో 285 పరుగులు చేశాడు. ఈ సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సీజన్లో కేకేఆర్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జాసన్ రాయ్‌కి ముందు గస్ ఇంగ్లండ్ బౌల్ గస్ అట్కిన్సన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండగా.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రీలంకకు చెందిన దుష్మంత చమీరను తీసుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

