ఒక్కో ఫ్రాంచైజీకి 2వేల కోట్లు

- ఐపీఎల్ టెండర్లు ఆహ్వానించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరనున్న రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లను ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ ఎడిషన్ పది టీమ్‌లతో ఆడాలని బీసీసీఐ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ సీజన్లో పాల్గొనబోయే జట్ల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం బిడ్లను పిలిచినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం ఏదైనా సంస్థ రూ.10 లక్షలు విలువ చేసే టెండర్‌ను కొనుగోలు చేసి దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 5 ఆఖరి తేదీగా ప్రకటించిన బోర్డు…కొనుగోలు మొత్తాన్ని నాన్ రిఫండబుల్ అని ప్రకటించిం ది. అయితే తొలుత ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ.1700 కోట్లు అనుకున్న బీసీసీఐ..కనీస ధరను రూ 2వేల కోట్లకు పెంచింది. నిబంధనలకు అనుగుణంగా టెండర్ దాఖలు చేసే కంపెనీకి ఫ్రాంచైజీ సొంతం కావచ్చు. మొత్తంగా రెండు జట్ల ద్వారా దాదాపు రూ.5వేల కోట్లు ఆర్జించాలనే లక్ష్యంతో బోర్డు కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే కొత్తగా రానున్న రెండు జట్లలో ఒకటి అహ్మదాబాద్ నుంచి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

