సెంచరీ చేసిన బెయిర్ స్టో మీదకు షూ, చెప్పులు తీసి..! బర్మీ ఆర్మీకి ఇదేం పైత్యం
తమకు నచ్చిన ఆటగాడు అద్భుతంగా ఆడినప్పుడు వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే ఆ అభిమానం హద్దులు మీరితే చూడటానికి వికారంగా ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అభిమానం కూడా ఇలాగే మారింది. బర్మీ ఆర్మీగా పిలుచుకునే వీరంతా తాజాగా ఆ జట్టు ఆటగాడు బెయిర్ స్టో మీదకు తాము వేసుకున్న చెప్పులు, షూ తీసి చూపించారు. కంగారు పడకండి.. ఇదో రకం సెలబ్రేషన్ అట..
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య లీడ్స్ లోని హెడ్డింగ్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో ఇంగ్లీష్ బ్యాటర్ బెయిర్ స్టో (130 బ్యాటింగ్) వీరోచిత పోరాటం చేశాడు. టీ20 ఆటను తలపిస్తూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ ను ఆదుకున్నాడు. జెమీ ఓవర్టన్ (89 నాటౌట్) తో కలిసి ఏడో వికెట్ కు 209 పరుగులను జోడించాడు.
కాగా బెయిర్ స్టో సెంచరీ చేసిన తర్వాత బర్మీ ఆర్మీ అభిమానులు.. తాము వేసుకున్న షూస్, చెప్పులు తీసి వాటిని చేత పట్టి అతడికి అభివాదం చేశారు. ‘మీరు బెయిర్ స్టో అభిమానులైతే షూస్ తీయండి..’ అని హెడ్డింగ్లీ స్టేడియం మార్మోగిపోయింది. దీంతో మ్యాచ్ చూడటానికి వచ్చినోళ్లలో చాలా మంది షూస్, చెప్పులు తీసి ‘బెయిర్ స్టో.. బెయిర్ స్టో’ అని అరవడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు ‘ఇదేం పైత్యమో మరి..’ అని అనుకుంటున్నారు.
ఈ వీడియోను బర్మీ ఆర్మీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ టెస్టులో సెంచరీ చేసిన బెయిర్ స్టో.. రెండో టెస్టు లో కూడా దాటిగా ఆడి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
🎶 Shoes off, if you love Bairstow! 🎶#ENGvNZ pic.twitter.com/AAQ2vKUjNS
— Jonny Bairstow’s Barmy Army (@TheBarmyArmy) June 24, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

