Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
Asian Hockey Championships : క్రికెట్లో భారత జట్టు చేతిలో పదేపదే చిత్తుగా ఓడుతున్న పాకిస్థాన్ ఈసారి హాకీలో పోటీకి ముందే చేతులెత్తేసింది. ఆసియా ఛాంపియన్స్ పురుషుల హాకీ ట్రోఫీ నుంచి పాక్ జట్టు అనూహ్యంగా వైదొలిగింది.
Asian Hockey Championships : క్రికెట్లో భారత జట్టు చేతిలో పదేపదే చిత్తుగా ఓడుతున్న పాకిస్థాన్(Pakistan) ఈసారి హాకీలో పోటీకి ముందే చేతులెత్తేసింది. ఆసియా ఛాంపియన్స్ పురుషుల హాకీ ట్రోఫీ -2026లో భారత జట్టుతో తలపడాల్సిన పాక్ జట్టు అనూహ్య పరిణామాల మధ్య టోర్నీ నుంచి వైదొలిగింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 27న జలంధర్ (పంజాబ్)లో దాయాదుల మ్యాచ్ జరగాలి. అయితే.. తటస్థ వేదికపై పట్టుపట్టి పంతం నెగ్గించుకోలేకపోయిన దాయాది హాకీ ఫెడరేషన్.. ‘మేము బాయ్‌కాట్ చేస్తున్నాం’ అని చెప్పేసింది.
భారత్ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్స్ పురుషుల హాకీ ట్రోఫీ -2026లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. అయితే.. అక్టోబర్ 27న తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన పాకిస్థాన్‌ను ఢీకొట్టాలి. కానీ, టోర్నీ మొదలవ్వకముందే పాక్ తప్పుకుంది. ఇండో-పాక్ మ్యాచ్‌ను తటస్థ వేదికపై జరపాలని ఆ దేశ హాకీ సమాఖ్య పట్టుపట్టగా ఆసియా హాకీ సమాఖ్య, హాకీ ఇండియాలు తిరస్కరించడమే అందుకు కారణం.
Bangladesh replace Pakistan in Asian Champions Trophy Punjab 2026
https://t.co/hF4MWeMM3z https://t.co/6GiG5Ep2jN
— NDTV Sports (@Sports_NDTV) October 9, 2026
భారత్, పాక్ మధ్య రాజకీయ, దౌత్య సంబంధాల్లో అనిశ్చితి కారణంగా తమ జట్టును ఇండియాకు పంపబోమని, క్రికెట్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరపాలని పీహెచ్ఎఫ్ కోరింది. కానీ, అందుకు హాకీ ఇండియా, ఆసియా హాకీ సమాఖ్య అంగీకరించలేదు. ఎట్టిపరిస్థితిలోను అన్ని జట్లు భారత్‌కు రావాలని హెచ్ఐ, ఏహెచ్ఎఫ్లు స్పష్టం చేశాయి. దాంతో.. పాక్ ఈ టోర్నీని బాయ్‌కాట్ చేసింది. ఫలితంగా దాయాది స్థానంలో బంగ్లాదేశ్ జట్టు అర్హత సాధించింది. చైనా, జపాన్, మలేషియా, దక్షిణకొరియా, బంగ్లాదేశ్‌లతో భారత్ లీగ్ దశలో తలపడనుంది.
రెండు స్టేడియాల్లో
పంజాబ్‌లోని రెండు వేదికలైన మొహాలీ, జలంధర్‌లో లీగ్ దశ, నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. నవంబర్ 5న ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది. జలంధర్‌లోని ఒలింపియన్ సుర్జిత్ సింగ్ హాకీ స్టేడియంలో గ్రూప్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆపై మొహాలీలోని బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో నాకౌట్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 4న సెమీఫైనల్స్.. కాంస్య పోరు, ఫైనల్ నవంబర్ 5న ఉంటాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

