AUS vs BAN | ఆసీస్ తడబాటు.. స్మిత్, గ్రీన్ నిలబడేనా..!
AUS vs BAN : మెక్కే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. బంగ్లాదేశ్‌ను 64కే కట్టడి చేసిన ఆసీస్ సైతం చూస్తుండగానే కీలక వికెట్లు కోల్పోయింది.
AUS vs BAN : మెక్కే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. బంగ్లాదేశ్‌ను 64కే కట్టడి చేసిన ఆసీస్ సైతం చూస్తుండగానే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విఫలమవ్వగా.. మూడో స్థానంలో వచ్చిన మార్నస్ లబూషేన్(4) మళ్లీ నిరాశపరిచాడు. షొరిఫుల్ ఇస్లాం(2-15) ధాటికి స్కోర్ వేగం తగ్గిపోగా.. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(19 నాటౌట్), స్టీవ్ స్మిత్(26 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు.
బంగ్లాదేశ్‌ను త్వరత్వరగా ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా సైతం కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు తస్కిన్ అహ్మద్ మొదటి షాకిచ్చాడు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన రెన్షా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో, 22 పరుగల వద్ద ఆసీస్ తొలి వికెట్ పడింది.
Back in the side, Shoriful Islam takes two in his first over 👏
(via @cricketcomau) pic.twitter.com/gnpf5rtzDP
— Cricinfo (@cricinfo) August 22, 2026
ఆ తర్వాత షొరిఫుల్ ఇస్లాం(2-15) ఒకే ఓవర్లో డేంజరస్ ట్రావిస్ హెడ్(22), మార్నస్ లబూషేన్(4)లను వెనక్కి పంపాడు. 41 పరుగుల వద్ద మూడో వికెట్ పడిన వేళ కామెరూన్ గ్రీన్(19 నాటౌట్), స్టీవ్ స్మిత్(26 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు. 21 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది ఆసీస్. ప్రస్తుతం కమిన్స్ సేన 36 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్టార్క్ నిప్పులు
ఆస్ట్రేలియా గడ్డపై 23 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయంతో ముందంజ వేసింది. డార్విన్ టెస్టులో గెలుపొందిన బంగ్లా కీలకమైన రెండో టెస్టులో తేలిపోయింది. తొలి సెషన్ మొదలైందో లేదో మిచెల్ స్టార్క్(6-12) నిప్పులు చెరగడంతో 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేదు. మరో ఎండ్‌లో కమిన్స్(3-25) సైతం చెలరేగగా లంచ్ తర్వాత పర్యాటక జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. సంచలన బౌలింగ్‌తో స్టార్క్ బెంబేలెత్తించగా 64 పరుగులకే బంగ్లా కుప్పకూలింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

