Michael Slater | ఒకటి కాదు ఏకంగా 19 కేసులు.. పోలీస్ కస్టడీలో క్రికెట్ దిగ్గజం
Michael Slater : క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అయిన మైఖేల్ స్లేటర్(Michael Slater) చిక్కుల్లో పడ్డాడు. 54 ఏండ్ల వయసున్న అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను అరెస్ట్ చేశారు.
Michael Slater : క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అయిన మైఖేల్ స్లేటర్(Michael Slater) చిక్కుల్లో పడ్డాడు. 54 ఏండ్ల వయసున్న అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భార్యపై గృహ హింస (Domestic Violence)కు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం(Stalking) వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై ఇప్పటికే 19 కేసులు నమోదు అయ్యాయి. క్వీన్స్‌లాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్‌లో ఉండే స్లేటర్ 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో పలు నేరాలకు పాల్పడ్డాడు.
గృహ హింస, భయభ్రాంతులకు గురి చేయడం, దొంగతనానికి పాల్పడడం, భౌతిక దాడికి దిగడం.. ఇలా పలు రకాల కేసులు ఈ ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడిపై రిజిష్టర్ అయ్యాయి. అంతేకాదు పలుమార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యం కూడా స్లేటర్ సొంతం. మొండిగా వ్యవహరిస్తాడనే పేరున్న అతడు బెయిల్ నియమాల్ని సైతం ఉల్లంఘించిన దాఖలాలు లేకపోలేదు.

టీవీ కామెంటేటర్‌గా..
స్లేటర్ యాషెస్ టూర్‌తో అరంగేట్రం చేశాడు. 1993లో తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్లేటర్ కెరీర్ మొత్తంగా 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్‌గా రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

