AUSW vs NEDW | రికార్డు ఛేదనలో బదులివ్వని డచ్ బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం..!
AUSW vs NEDW : మహిళల పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా(Australia) దూసుకెళ్తోంది. తొలి రెండు మ్యాచుల్లోని గెలుపు జోరును కొనసాగించిన ఆసీస్ ఈసారి నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.
AUSW vs NEDW : మహిళల పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా(Australia) దూసుకెళ్తోంది. తొలి రెండు మ్యాచుల్లోని గెలుపు జోరును కొనసాగించిన ఆసీస్ ఈసారి నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ బేత్ మూనీ(74), అషే గార్డ్నర్(58)ల విధ్వంసంతో రికార్డు స్కోర్ కొట్టిన కంగారూ టీమ్..అనంతరం డచ్ జట్టును వణికించింది. కిమ్ గార్త్(2-20) ధాటికి సహచరులు విఫలమైనా బబెటె లీడే(56) అర్ధ శతకంతో పోరాడింది. 98 పరుగులతో జయభేరి మోగించిన ఆసీస్ గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానం కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చెలరేగుతోంది. ఇప్పటికే ఆరుసార్లు ట్రోఫీని తన్నుకుపోయిన ఆసీస్.. పదో సీజన్లోనూ సంచలన ఆటతో మూడో విజయం నమోదు చేసింది. సౌతాంప్టన్‌లో నెదర్లాండ్స్‌పై 219 పరుగుల రికార్డు స్కోర్ కొట్టిన ఆసీస్.. ఆ తర్వాత ప్రత్యర్థిని 121కే కట్టడి చేసింది. 98 పరుగుల భారీ విజయంతో గ్రూప్ ఏ నుంచి టాప్ ర్యాంక్ పట్టేసింది.
Three matches, three wins for six-time #T20WorldCup champions Australia 💪 pic.twitter.com/hhAZr9oyyl
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026
అర్ధ శతక భాగస్వామ్యం
ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ ఛేదనలో నెదర్లాండ్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభంలోనే ఆసీస్ పేసర్ కిమ్ గార్త్(2-20) విజృంభణతో ఓపెనర్లు వెనుదిరిగగా.. కెప్టెన్ బబెటె లీడె(56), స్టెర్రే కలిస్(44)లు ఆచితూచి ఆడారు. కంగారూ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పింది. కలిస్‌ను సథర్లాండ్ ఔట్ చేయడంతో డచ్ జట్టు ఆలౌట్ తప్పించుకున్నా భారీ తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక స్కోర్‌తో ఇంగ్లండ్ రికార్డు సమం చేసిన ఆసీస్.. మూడో విజయంతో తమతో అంత ఈజీ కాదని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.
In her 100th T20I, Netherlands captain Babette de Leede brings up her second fifty of the #T20WorldCup 👏 pic.twitter.com/OOEHLPNwOO
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2026
బేత్, గార్డ్నర్ దూకుడు
మహిళల పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా(Australia) రికార్డు స్కోర్ కొట్టేసింది. ఐసీసీ ఈవెంట్ అంటే చాలు రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించగా అత్యధిక పరుగులతో ఇంగ్లండ్ సరసన నిలిచింది. శనివారం సౌతాంప్టన్‌లో నెదర్లాండ్స్ బౌలర్లను ఓపెనర్ బేత్ మూనీ(74), అషే గార్డ్నర్(58)లు ఉతికేయడంతో కంగారూ టీమ్ అలవోకగా రెండొందలు బాదింది. ఆసీస్ కంటే ముందు ఇదే ఎడిషన్‌లో ఇంగ్లండ్ 219 పరుగులతో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

