David Warner: ఆసీస్ దిగ్గజం రికార్డును బ్రేక్ చేసిన వార్నర్.. ఆ జాబితాలో రెండో స్థానం కైవసం
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
David Warner: తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా రికార్డును అధిగమించాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా వార్నర్ ఈ రికార్డు సాధించాడు.
ఆస్ట్రేలియా తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లలో కలిపి అత్యధిక పరుగులు చేసినవారిలో రికీ పాంటింగ్ అందరికంటే ముందున్నాడు. ఈ ఆసీస్ దిగ్గజం.. 1995-2012 మధ్యకాలంలో 559 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 667 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 27,368 పరుగులు చేశాడు. రెండో స్థానంలో వార్నర్.. 371 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 460 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి 18,515 పరుగులు చేశాడు. మెల్బోర్న్ టెస్టు తొలి రోజు కంటే ముందు రెండో స్థానంలో స్టీవ్ వా ఉండేవాడు. స్టీవ్ వా.. 1985-2014 మధ్యకాలంలో.. 493 మ్యాచ్‌లు ఆడి.. 18,496 రన్స్ చేశాడు. తాజాగా మెల్బోర్న్ టెస్టులో వార్నర్.. 38 పరుగులు చేయడం ద్వారా వా రికార్డును అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్, వార్నర్, స్టీవ్ వా తర్వాత అలెన్ బోర్డర్ (1,768), మైకెల్ క్లార్క్ (17,112)లు టాప్-5 లో ఉన్నారు. యాక్టివ్ ప్లేయర్లలో మాత్రం వార్నర్ తర్వాతి స్థానం స్టీవ్ స్మిత్‌దే.. ఈ ఆసీస్ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో 15,857 పరుగులు చేశాడు.
David Warner becomes the 2nd leading run-getter for Australia across all formats.
– An all time great, Warner. 🔥 pic.twitter.com/YOq1m1FmRS
— Johns. (@CricCrazyJohns) December 26, 2023
టెస్టులలో ఐదో స్థానం..
ఆసీస్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసినవారిలో వార్నర్‌ది ఐదో స్థానం.. ఈ జాబితాలో పాంటింగ్ (13,378), బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927), స్టీవ్ స్మిత్ (9,422)లు వార్నర్ కంటే ముందున్నారు. వార్నర్.. 202 ఇన్నింగ్స్‌లలో 8,689 పరగులు చేశాడు.
పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులు..
పాకిస్తాన్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ల జాబితాలో వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వార్నర్.. పాక్ టీమ్ పై 49 ఇన్నింగ్స్‌లలో 2,691 పరగులు సాధించాడు. పాంటింగ్.. 62 ఇన్నింగ్స్‌లలో 2,671 రన్స్ చేశాడు. అలెన్ బోర్డర్.. 67 ఇన్నింగ్స్‌లలో 2,313 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

