AUS vs NED: చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. కంగారూలకు రికార్డు విజయం
AUS vs NED: వరుసగా రెండు పరాజయాల తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది.
AUS vs NED: వరుసగా రెండు పరాజయాల తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసింది. నెదర్లాండ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. 309 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసి 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసింది. ఫలితంగా కంగారూలు.. 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.
ఆసీస్ నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ ఏ దశలోనూ పోటీనివ్వలేదు. 28 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత డచ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. విక్రమ్ జిత్ సింగ్ (25), అకర్మన్ (10), బస్ డీ లీడ్ (4), సిబ్రండ్ (11) లు క్రీజులో నిలబడటానికే నానా తంటాలు పడ్డారు.
62 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 నాటౌట్), తేజ నిడమనూరు (18 బంతుల్లో 14, 2 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్ కు 22 పరుగులు జతచేశాడు. తేజను మిచెల్ మార్ష్ ఔట్ చేశాక తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాటర్లు లొగాన్ వాన్ బీక్, వాన్ డెర్ మెర్వ్‌లు సున్నాలు చుట్టారు. ఆర్యన్ దత్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వాన్ డెర్ మెర్వ్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 90 వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు నాలుగు వికెట్లు దక్కగా మార్ష్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. వన్డేలలో భారత జట్టు.. 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

