ICC Player Of The Month | యాషెస్ హీరోకు జై కొట్టిన ఓటర్లు.. గార్డ్నర్ డబుల్ ధమాకా
ICC Player Of The Month : యాషెస్ హీరో క్రిస్ వోక్స్(Chris Woakes) జూలై నెలకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' (ICC Player Of The Month) అవార్డుకు ఎంపికయ్యాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్(Ashes Seires)లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నఈ ఇంగ్లండ్ పేసర్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అష్ గార్డ్నర్..
ICC Player Of The Month : యాషెస్ హీరో క్రిస్ వోక్స్(Chris Woakes) జూలై నెలకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (ICC Player Of The Month) అవార్డుకు ఎంపికయ్యాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్(Ashes Seires)లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నఈ ఇంగ్లండ్ పేసర్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(Zac Crawley), నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డీ లీడె(Bas de Leede)లకు నిరాశే ఎదురైంది. కంగారుల దెబ్బకు డీలా పడిన ఇంగ్లండ్ వోక్స్ సూపర్ స్పెల్‌తో సిరీస్‌లో నిలిచింది.
అవును.. అతను ఆడింది మూడు మ్యాచులే అయినా 19 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. ఆతిథ్య జట్టు 2-2తో సమం చేయడంలో వోక్స్ కీలక పాత్ర పోషించాడు. దాంతో, అతడికే ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. సమిష్టి కృషితోనే మేము యాషెస్ సిరీస్ సమం చేశాం. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించడం వల్లనే నాకు ఈ అవార్డు వచ్చింది’ అని వోక్స్ తెలిపాడు.
❤️ The match-winning moment…
Chris Woakes, what a man 👏 #EnglandCricket | #Ashes pic.twitter.com/hnhvEMu0jR
— England Cricket (@englandcricket) July 9, 2023
గార్డ్నర్ సరికొత్త రికార్డు
మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అష్ గార్డ్నర్(Ashleigh Gardner) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకుంది. దాంతో, వరుసగా రెండోసారి ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ అవార్డు కోసం ఆసీస్ మరో ఆల్‌రౌండర్ అలీసా పెర్రీ(Ellyse Perry) ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్(Nat Sciver-Brunt) పోటీపడ్డారు.
అష్ గార్డ్నర్

అయితే.. పోలింగ్‌లో గార్డ్నర్కు ఎక్కువ ఓట్లు రావడంతో ఐసీసీ ఆమెనే విజేతగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టులో ఈ ఆఫ్ స్పిన్నర్ 12 వికెట్లతో చెలరేగింది. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు కూల్చి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించింది. దాంతో, జూన్ నెలలో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచింది.
ఇవి కూడా చదవండి
FIFA World Cup 2023 | చరిత్ర సృష్టించిన స్పెయిన్.. తొలిసారి ఫైనల్ చేరిన మహిళల జట్టు
Virat Kohli | స్వాతంత్య్ర దినోత్సవం నాకెంతో ప్రత్యేకం.. బాల్యపు రోజుల్ని గుర్తు చేసుకున్న కోహ్లీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

