Copa America: ఫైనల్లో గాయపడ్డ మెస్సి.. అయినా అర్జెంటీనాకే కోపా అమెరికా టైటిల్
Copa America: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో 16వ సారి ఆ టైటిల్‌ను కైవసం చేసుకున్నది. అర్జెంటీనా 1-0 గోల్స్ తేడాతో కొలంబియాపై విక్టరీ కొట్టింది. 112వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ స్ట్రయికర్ లౌటారో మార్టినేజ్ గోల్ చేశాడు.
మియామి: కోపా అమెరికా(Copa America) ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి ఆ టైటిల్‌ను చేజిక్కించుకున్నది. అర్జెంటీనా 1-0 గోల్స్ తేడాతో కొలంబియాపై విక్టరీ కొట్టింది. 112వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ స్ట్రయికర్ లౌటారో మార్టినేజ్ గోల్ చేశాడు. తొలి 90 నిమిషాల ఆటలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ కొట్టలేకపోయింది. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంలోకి వెళ్లింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనిల్ మెస్సి రెండవ అర్థభాగంలో గాయపడ్డాడు. మడిమ గాయంతో అతను ఇబ్బందిపడ్డాడు.
అర్జెంటీనా రికార్డు స్థాయిలో 16వ సారి కోపా అమెరికా టైటిల్‌ను కైవసం చేసుకున్నది. అయితే ఈసారి ఫైనల్ సుమారు 80 నిమిషాల పాటు ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. మియామిలో మ్యాచ్ కోసం వచ్చి టికెట్లు దొరకని ఫుట్‌బాల్ అభిమానులు హార్డ్ రాక్ స్టేడియం వద్ద ఘర్షణకు దిగారు. టికెట్లేని ఫుట్‌బాల్ ప్రేమికులు చాలా మంది స్టేడియంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
గేమ్ హాఫ్ టైంలో .. 25 నిమిషాల పాటు కొలంబియా పాప్‌స్టార్ షకీరాతో కచేరి నిర్వహించారు. వాతావరణం చాలా వేడిగా ఉండడంతో.. ప్రేక్షకులు చాలా ఇబ్బందిలు ఎదుర్కొన్నారు. ఈ టోర్నీలో అయిదు గోల్స్ చేసిన మార్టినేజ్కు గోల్డెన్ బూట్ అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

