IPL 2021: ధోనీని మోటివేట్ చేసిన ఏఆర్ రెహమాన్.. లగాన్ సాంగ్ అంకితం

ముంబై: ఐపీఎల్లో తొలి మ్యాచ్‌లోనే ఓడి, తాను కూడా డకౌటై, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సూపర్‌హిట్ మూవీ లగాన్‌లోని ఓ పాటను ఈ సందర్భంగా ధోనీకి డెడికేట్ చేశాడు. అందులోని చలే చలో సాంగ్‌ను ధోనీకి తాను అంకిస్తున్నట్లు అతడు చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ షో అయిన క్రికెట్ లైవ్‌లో రెహమాన్ మాట్లాడాడు.
ధోనీతోపాటు సీఎస్కే బ్యాట్స్‌మన్ రైనాకు కూడా అతడు ఓ పాట అంకితమిచ్చాడు. రంగీలా మూవీలోని మంగ్తా హై క్యా సాంగ్‌ను రైనాకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పాడు. క్రికెట్‌ను కలిసికట్టుగా ఆడేలా ప్లేయర్స్‌ను చలే చలో సాంగ్ ప్రేరేపిస్తుందని, అందుకే ఆ సాంగ్‌ను ధోనీకి అంకితమిస్తున్నట్లు ఈ ఆస్కార్ విన్నర్ చెప్పాడు.
ఇక రైనా కోసం మంగ్తా హై క్యా సాంగ్‌ను డెడికేట్ చేస్తానని, తాను ఎప్పుడు బెంగళూరు వెళ్లినా వాళ్లు రంగీలా పాటలే ఎక్కువగా వింటుంటారని రెహమాన్ అన్నాడు. తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడబోతోంది. తొలి మ్యాచ్ చివరి బంతికి గెలిచిన పంజాబ్ వరుసగా రెండో విజయంపై కన్నేయగా.. చెన్నై బోణీ కోసం ఆరాటపడుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

