Team India | భారత జట్టులోకి ఏపీ క్రికెటర్ నితీశ్ రెడ్డి.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు నా ప్రతిభను తక్కువ అంచనా వేసిన వాళ్ల కండ్లలో నా తండ్రికి ఇచ్చే గౌరవం చూడాలని ఉంది.
- ఐపీఎల్ హీరోలకు అందలం .. జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా గిల్
Team India | ముంబై: ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టిన కుర్రాళ్లకు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో సెలక్టర్లు ఈ పర్యటనలో పలువురు ఐపీఎల్ హీరోలకు అవకాశమిచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడుతూ సీజన్ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డితో పాటు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండేకు చోటు దక్కింది.
ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ఉన్న ఆటగాళ్లలో జైస్వాల్, శాంసన్ మినహా అందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ పర్యటనలో యువ భారత్.. జింబాబ్వేతో ఐదు టీ20లు ఆడనుంది. జూలై 6 నుంచి 14వ తేదీ వరకు సిరీస్ జరుగుతుంది.
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది. నాన్నకు కూడా సంతోషం. కానీ 50 శాతమే నా కల నెరవేరింది. జెర్సీ ధరించి దేశం తరఫున మ్యాచ్ గెలిపించినప్పుడే వంద శాతం నా స్వప్నం సాకారమైనట్లు. ఒకప్పుడు నా ప్రతిభను తక్కువ అంచనా వేసిన వాళ్ల కండ్లలో నా తండ్రికి ఇచ్చే గౌరవం చూడాలని ఉంది. ఐపీఎల్లో కమిన్స్, క్లాసెన్, భువనేశ్వర్ నాకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా రాణించాలో ఐపీఎల్ ద్వారా నేర్చుకున్నాను.
-నితీశ్ రెడ్డి
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

