Anil Kumble | టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్లు వాళ్లిద్దరే : అనిల్ కుంబ్లే
ఇషాన్ కిషన్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్లు అని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ మాత్రం ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ సూపర్ స్టార్లు అవుతారని చెప్పాడు.
Anil Kumble : టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్లు ఎవరనే విషయమై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా స్పందించాడు. యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. వీళ్లిద్దరూ టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్లు అని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. వీళ్లిద్దరూ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తారని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో సినిమా కొత్త ఎపిసోడ్ లెజెండ్స్ లాంజేలో మాట్లాడుతూ.. ‘అర్ష్‌దీప్ లాంటి క్రికెటర్‌తో పనిచేయడం, అతను అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటేచూడడం చాలా అద్భుతమైన ఫీలింగ్ అర్ష్‌దీప్ సింగ్ భారత సూపర్ స్టార్ బౌలర్ అవుతాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇషాన్ కిషన్ సూపర్ స్టార్ బ్యాటర్ అవుతాడు. అతను అవకాశాల్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ మధ్యే డబుల్ సెంచరీ కూడా కొట్టాడు’ అని కుంబ్లే వెల్లడించాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా కుంబ్లేతో ఏకీభవించాడు. అర్ష్‌దీప్, ఇషాన్ భారత జట్టుకు దీర్ఘకాలం సేవలు అందిస్తారిని అతను అన్నాడు.
ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ..
భారత మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ భవిష్యత్ సూపర్ స్టార్లు అవుతారని తెలిపాడు. ‘ఉమ్రాన్ చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడు. ఇండియాకు ఇప్పటికే ఆడుతున్నాడు కూడా. తిలక్ వర్మ గత రెండేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యం ఏంటో ఇప్పటికే అందరం చూశాం. అతను జట్టును నడిపించగల సమర్ధుడు’ అని పార్థీవ్ వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

