Amitabh Bachchan | మెస్సీ, రొనాల్డో, ఎంబాపేతో బిగ్‌బీ.. అద్భుతమైన సాయంత్రం అంటూ ట్విట్టర్లో పోస్ట్
రియాద్ స్టేడియంలో పీఎస్జీ, సౌదీ అరేబియా ఎక్స్ఐ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా అమితాబ్
Amitabh Bachchan : బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు సౌదీఅరేబియాలో అరుదైన గౌరవం లభించింది. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, ఎంబాపే, నెయ్మర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్‌ను బిగ్‌బీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన ఈ ఫుట్‌బాల్ స్టార్లతో దిగిన ఫొటోలు, వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. రియాద్ స్టేడియంలో పీఎస్జీ, సౌదీ అరేబియా ఎక్స్ఐ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఆయన మెస్సీ, రొనాల్డో కరచాలనం చేశారు. ‘రియాద్‌లో ఒక సాయంత్రం.. ఎంత అద్భతమైన సాయంత్రమో?. మెస్సీ, రొనాల్డో, ఎంబాపే, నెయ్మర్.. వీళ్లంతా కలిసి ఆడుతున్నారు. పీఎస్జీ వర్సెస్ రియాద్ సీజన్స్.. ఈ మ్యాచ్‌ను ప్రారంభించేందుకు అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అమితాబ్ క్యాప్సన్ రాశారు. వీడియోలో మ్యాచ్ అధికారులతో కలిసి బిగ్‌బీ స్టేడియం లోపలికి వెళ్తారు. మెస్సీ, రొనాల్డో, ఎంబాపే, నెయ్మర్, వాళ్ల పక్కన నిల్చొన్న పిల్లలతో కరచాలనం చేస్తూ.. విష్ చేస్తారు.
వరల్డ్ కప్ తర్వాత ఫుట్‌బాల్ హేమాహేమీలు ఒక వేదిక మీద ఫ్యాన్స్‌ను అలరించారు. మెస్సీ కెప్టెన్సీలోని పీఎస్జీ, రొనాల్డో సారథ్యంలోని అల్ నస్రి, అల్ హిలాల్ క్లబ్ టీమ్‌ను ఫస్ట్ మ్యాచ్‌లో 5-4 తో ఓడించింది. మెస్సీ, రొనాల్డోలు ప్రత్యర్థులుగా ఒక మ్యాచ్‌లో తలపడడం 2020 తర్వాత ఇదే మొదటిసారి. మొత్తంగా చూస్తే.. వీళ్ల కెరీర్లో 37వ సారి.
T 4533 – “An evening in Riyadh .. ” what an evening ..
Cristiano Ronaldo, Lionel Messi, Mbape, Neymar all playing together .. and yours truly invited guest to inaugurate the game .. PSG vs Riyadh Seasons ..
Incredible !!!#football #Ronaldo #Messi #AlNassr #SaudiArabia pic.twitter.com/ZD2OUEb3F7— Amitabh Bachchan (@SrBachchan) January 19, 2023
T 4533 – “An evening in Riyadh .. ” what an evening ..
Cristiano Ronaldo, Lionel Messi, Mbape, Neymar all playing together .. and yours truly invited guest to inaugurate the game .. PSG vs Riyadh Seasons ..
Incredible !!!#football #Ronaldo #Messi #AlNassr #SaudiArabia pic.twitter.com/fXlaw9meeV— Amitabh Bachchan (@SrBachchan) January 20, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

