Australia Open 2024: క్వార్టర్స్‌కు రెడీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్.. ఎవరితో ఎవరు తలపడుతున్నారంటే..!
Australia Open 2024: సంచలన ఫలితాలు, టాప్ సీడ్ ఆటగాళ్ల నిష్క్రమణ, యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలతో ప్రిక్వార్టర్ పోటీలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి క్వార్టర్స్ పోరు మొదలుకానుంది.
Australia Open 2024: పది రోజులుగా టెన్నిస్ ప్రేక్షకులను అలరిస్తున్న సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ దశకు చేరుకుంది. సంచలన ఫలితాలు, టాప్ సీడ్ ఆటగాళ్ల నిష్క్రమణ, యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలతో ప్రిక్వార్టర్ పోటీలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి క్వార్టర్స్ పోరు మొదలుకానుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ – 15లో ఉన్న ఆటగాళ్లలో ఎనిమిది మంది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో కూడా టాప్ – 15 ర్యాంకర్లలో నలుగురు మాత్రమే క్వార్టర్స్ చేరగా మిగిలిన నలుగురు తొలిసారి రౌండ్ ఆఫ్ 8కు అర్హత సాధించారు. ఆ జాబితాను ఇక్కడ చూద్దాం.
పురుషుల సింగిల్స్‌లో..
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్ (1), రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (2), డేనియల్ మెద్వదేవ్ (3), జన్నిక్ సిన్నర్ (4), ఆండ్రీ రుబ్లెవ్ (5), అలెగ్జాండర్ జ్వెరెవ్ (6), హ్యూబర్ట్ హుర్కాజ్ (9), టేలర్ ఫ్రిట్జ్ (12)లు క్వార్టర్స్‌కు చేరారు. వీరిలో ఎవరితో ఎవరు పోటీ పడుతున్నారంటే..
క్వార్టర్స్‌లో భాగంగా మంగళవారం తొలి పోరు డిఫెండింగ్ ఛాంపియన్ జొకోవిచ్.. టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడబోతున్నాడు. ఆ తర్వాత సిన్నర్.. రుబ్లెవ్‌ను ఢీకొంటాడు. బుధవారం హుర్కాజ్ .. మెద్వదేవ్‌తో ఆడనున్నాడు. స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్.. జ్వెరెవ్‌తో తాడో పేడో తేల్చుకోనున్నాడు. టాప్ సీడ్స్ అందరూ పోటీలో ఉండటంతో క్వార్టర్స్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
He’s coming for the 👑@carlosalcaraz • #AusOpen • #AO2024 pic.twitter.com/XhekdIHp2Z
— #AusOpen (@AustralianOpen) January 22, 2024
మహిళల సింగిల్స్‌లో..
మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌కు చేరినవారిలో డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంక (1), క్రెజికోవా (9), కోకో గాఫ్ (4), కిన్వెన్ జెంగ్ (12)లతో పాటు నొస్కోవా (చెక్ రిపబ్లిక్), యస్త్రంస్క (ఉక్రెయిన్), కోస్ట్యుక్ (ఉక్రెయిన్), అన్నా కలిన్స్కయ (రష్యా) లు ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం నాలుగు మ్యాచ్‌లు పూర్తవుతాయి. నొస్కొవ – యస్త్రంస్క తో క్వార్టర్స్ ఆడనుంది. కలిన్స్కయ.. జెంగ్‌తో పోటీ పడనుంది. కోకోగాఫ్తో కోస్ట్యుక్ తలపడనుండగా సబలెంక.. క్రెజికోవాతో అమీతుమీ తేల్చుకోనుంది.
Day 10 | Women’s quarterfinal preview 🙌
Fasten your seatbelts 🎢https://t.co/DEZp0msqu2
— #AusOpen (@AustralianOpen) January 22, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

