Alcaraz | వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ నయా సంచలనం అల్కరాజ్.. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆదివారం వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్పై అల్కరాజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మహిళల సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌గా అడుగుపెట్టి టైటిల్ గెలిచిన వొండ్రుసోవా కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరింది.
వింబుల్డన్ ఆరంభానికి ముందు మహిళల ర్యాంకింగ్స్‌లో 42వ ర్యాంక్‌లో ఉన్న వొండ్రొసోవా.. 32 స్థానాలు ఎగబాకి టాప్-10లో అడుగుపెట్టింది. ఇగా స్వియాటెక్ ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగుతున్నది. భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకాడు. 2013 అక్టోబర్ తర్వాత బోపన్నకు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం.