హైదరాబాద్: ఆసియా హ్యాండ్‌బాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్‌లో అల్ వాక్రా గెలుపు జోరు కొనసాగిస్తున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అల్వాక్రా 25-22తో మెస్ కిర్మాన్ (ఇరాన్)పై గెలిచింది.అల్ వాక్రా తరఫున ఐస్సా ఏడు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో అల్ నజ్మా 30-29తో అల్ కువైట్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు అభినందించారు.