Rachin Ravindra: తొలి టెస్టులో బ్యాట్‌తో.. ఇప్పుడు బంతితో.. రఫ్ఫాడిస్తున్న రచిన్
Rachin Ravindra: భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి రాణించిన ఈ భారత సంతతి కుర్రాడు.. ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ (240) బాదాడు. అదే సఫారీలతో నేడు హమిల్టన్ వేదికగా మొదలైన రెండో టెస్టులో రచిన్..
Rachin Ravindra: న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ కెరీర్లోనే బెస్ట్ ఫామ్‌తో రెచ్చిపోతున్నాడు. భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి రాణించిన ఈ భారత సంతతి కుర్రాడు.. ఇటీవలే న్యూజిలాండ్ టెస్టు జట్టులో రీఎంట్రీ ఇచ్చి దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ (240) బాదాడు. అదే సఫారీలతో నేడు హమిల్టన్ వేదికగా మొదలైన రెండో టెస్టులో రచిన్.. బంతితోనూ రెచ్చిపోయాడు. తొలి రోజు 21 ఓవర్లు వేసిన రచిన్.. 8 మెయిడిన్లు వేసి 33 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. రచిన్.. దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ను కట్టడిచేయడంతో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
హమిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ జట్టు.. బ్యాటింగ్‌లో మళ్లీ తడబడింది. వికెట్ కీపర్ గ్లైడ్ ఫోర్టూన్ డకౌట్ అవగా.. కెప్టెన్ నీల్ బ్రాండ్ (25), రేనాండ్ వాన్ టోండర్ (32)లు ఫర్వాలేదనిపించారు. ఈ ఇద్దరూ ఔటయ్యాక సఫారీ మిడిలార్డర్‌ను రచిన్ ఔట్ చేశాడు. జుబేర్ హమ్జా (20), డేవిడ్ బెడింగ్హమ్ (39), కీగన్ పీటర్సన్ (2)లు రవీంద్ర మాయాజాలానికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
150 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను రువాన్ డి స్వార్డ్ట్ (55 బ్యాటింగ్), షువాన్ వోన్ బెర్గ్ (34 నాటౌట్) లు ఏడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించింది. కివీస్ బౌలర్లలో మాథ్యూ హెన్రీ, విలియమ్ ఓరుక్, నీల్ వాగ్నర్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. జట్టులోకి వచ్చిన ఆనతికాలంలోనే నమ్మదగిన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న రచిన్.. రెండో రోజు ఇంకేం మ్యాజిక్ చేస్తాడో చూడాలి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

