Most Runs In Single ODI | బ్యాటర్ల వీరబాదుడుకు వరల్డ్ క్లాస్ బౌలర్లు బలి.. వన్డేల్లో భారీగా పరుగులిచ్చింది వీళ్లే
Most Runs In Single ODI : క్రికెట్లో బౌలర్ల జోరుకు పవర్ హిట్టర్లు బ్రేకులు వేస్తున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేస్తున్నారు. దాంతో, మేటి బౌలర్లు కూడా చెత్త రికార్డు మూటగట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) చెత్త రికార్డు ఖాతాలో...
Most Runs In Single ODI : క్రికెట్లో బౌలర్ల జోరుకు పవర్ హిట్టర్లు బ్రేకులు వేస్తున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేస్తున్నారు. దాంతో, మేటి బౌలర్లు కూడా చెత్త రికార్డు మూటగట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు.
నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో జంపా వికెట్ తీయకుండానే 113 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో 50 ఓవర్ల ఆటలో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్‌గా తమ దేశానికే చెందిన మిక్ లెవిస్(Mick Lewis) సరసన నిలిచాడు. లెవిస్ 2006లో సఫారీ జట్టుపైనే ఈ గణాంకాలు నమోదు చేయడం విశేషం.
Adam Zampa joined a very expensive club yesterday😐#SAvAUS pic.twitter.com/LssijixUlX
— ESPNcricinfo (@ESPNcricinfo) September 16, 2023
వన్డేల్లో భారీగా పరుగులు ఇచ్చిన టాప్ -5 బౌలర్లలో పాక్ మాజీ స్పీడ్‌స్టర్ వహాబ్ రియాజ్(Wahab Riaz), అఫ్గనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) భారత పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuwaneshwar Kumar)లు ఉన్నారు. ప్రస్తుతం జంపా, లెవిస్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రియాజ్ 2006లో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి ఏకంగా 110 రన్స్ ఇచ్చాడు.
రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్

మేటి స్పిన్నర్‌గా ఎదిగిన రషీద్ ఖాన్ కూడా బ్యాటర్ల బాధితుడే. 2019లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ క్రికెటర్లు రషీద్ బౌలింగ్‌లో దంచికొట్టారు. దాంతో, ఆ బౌలింగ్ ఆల్‌రౌండర్ 9 ఓవర్లలోనే 110 రన్స్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ల ధాటికి భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా బలయ్యాడు. 2015లో సఫారీ ఆటగాళ్లు చెలరేగడంతో భువీ 106 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Australians Missing Century | ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్.. ఆ నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరంటే..?
Travis Head | చేయి విరగ్గొట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్.. వరల్డ్ కప్‌లో ఆడేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

