NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
NZvIND: కివీస్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది.కివీస్ విసిరిన 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో అందుకున్నది. ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 38 బంతుల్లో 113 రన్స్ చేసి ఔటయ్యాడు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్(NZvIND)లో ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది.కివీస్ విసిరిన 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో అందుకున్నది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యాన్ని సాధించి సిరీస్‌ను వశం చేసుకున్నది. ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన అతను కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అభిషేక్ 38 బంతుల్లో 113 రన్స్ చేసి ఔటయ్యాడు.
ఛేజింగ్‌లో ఇండియన్ ఓపెనర్లు చెలరేగిపోయారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ ఇద్దరూ తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ తొలి వికెట్‌కు 133 రన్స్ జోడించారు. వైభవ్ 45 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే పవర్ ప్లేలో ఇండియా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 6 ఓవర్లలోనే భారత ఓపెనర్లు 118 రన్స్ చేశారు.
కివీస్ బౌలర్లు ఏ దశలోనూ తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. అభిషేక్, వైభవ్ ఆడుతున్న తీరు.. కివీస్ బౌలర్లలో దడపుట్టించింది. ఇండియా కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకున్నది. కివీస్ బౌలర్లలో జేమీసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
1️⃣9️⃣9️⃣ chased down in 13.2 overs 💥
📸 #TeamIndia take a 3️⃣-0️⃣ lead and seal the series with a run-chase for the ages 👏 🙌
Updates ▶️ https://t.co/zf4CnZQ8CD
#NZvIND https://t.co/pP6zHBmuns
— BCCI (@BCCI) October 27, 2026
తొలుత ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. డారెల్ మిచెల్ డాషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ 40, గ్లెన్ ఫిలిప్స్ 17, బెవాన్ జాకబ్స్ 39 రన్స్ చేశారు. జాకబ్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 రన్స్ చేశాడు. నాలుగో వికెట్ జాకబ్స్, మిచెల్ అజేయంగా 75 రన్స్ జోడించారు. ఆ ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నితీశ్, అక్షర్, అర్షదీప్ చెరో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

