వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో గురువారం సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ రూడ్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు.
పురుషుల సింగిల్స్‌లో రూడ్ 4-6, 6-3, 6-4, 3-6, 0-6తో బ్రాడీ చేతిలో ఓడాడు. ప్రత్యర్థి కన్నా ఏడు ఏస్‌లు ఎక్కువ సంపాదించిన రూడ్.. బ్రేక్ పాయింట్లను సద్వినియోగ పర్చుకోలేక ఇంటిబాట పట్టాడు. వావ్రింక, జ్వెరెవ్ ముందంజ వేశారు.