T20 Leagues in 2024: ల్యాగుల్లేవ్.. అన్నీ లీగులే.. ఏడాదంతా పొట్టి క్రికెట్ జాతర..
T20 Leagues in 2024: జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 దాకా సౌతాఫ్రికా వేదికగా ఎస్ఎ20 మొదలుకాబోతుంది. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్ లీగ్ ఇదే. దీని తర్వాత...
T20 Leagues in 2024: గతేడాది మాదిరిగానే 2024లో కూడా క్రికెట్ అభిమానులకు ‘పొట్టి క్రికెట్’ వినోదాన్ని పంచనున్నది. టెస్టులు, వన్డేలతో పోలిస్తే నాలుగు గంటల్లోనే ముగిసే టీ20 క్రికెట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో క్రికెట్ ఆడే ప్రతి దేశం ఫ్రాంచైజీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. భారీ స్థాయిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)తో పాటు టీ20 వరల్డ్ కప్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. ఈ ఏడాది వివిధ దేశాలలో జరుగబోయే టీ20 క్రికెట్ లీగ్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.
2024 ప్రారంభానికి ముందే బిగ్ బాష్ లీగ్ మొదలుకాగా ఈ నెల పూర్తయ్యేదాకా ఈ సీజన్ నడుస్తోంది. ఇక జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 దాకా సౌతాఫ్రికా వేదికగా ఎస్ఎ20 మొదలుకాబోతుంది. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్ లీగ్ ఇదే. దీని తర్వాత ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో క్రికెట్ అభిమానులు బిజీబిజీగా గడపనున్నారు.
– ఎస్ఎ20 – జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 దాకా.. దక్షిణాఫ్రికాలో..
– ఇంటర్నేషనల్ లీగ్ టీ20 – జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 దాకా.. యూఏఈలో..
– బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) -జనవరి 19 నుంచి మార్చి 1 దాకా.. బంగ్లాదేశ్‌లో..
– పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) – ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19 దాకా.. పాకిస్తాన్లో..
– ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – మార్చి 26 నుంచి మే 26 దాకా.. (అధికారికంగా తేదీలు ప్రకటించలేదు).. భారత్‌లో..
– వైటాలిటీ బ్లాస్ట్ – మే 30 నుంచి సెప్టెంబర్ 14 దాకా.. ఇంగ్లండ్‌లో
– టీ20 వరల్డ్ కప్ – జూన్ 4 నుంచి జూన్ 30 దాకా.. వెస్టిండీస్, అమెరికాలో..
– మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్సీ).. జులైలో.. అమెరికాలో..
– ద హండ్రెడ్ లీగ్ – ఆగస్టులో.. ఇంగ్లండ్
– కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) – ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా.. వెస్టిండీస్‌లో..
– టీ10 లీగ్.. అక్టోబర్‌లో.. యూఏఈలో..
– బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్).. డిసెంబర్-జనవరి.. ఆస్ట్రేలియాలో..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

