WhatsApp : వాట్సాప్‌లో త్వరలో యూజర్ నేమ్ పేరుతో కొత్త ఫీచర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇకపై యూజర్లు తమ నెంబర్ కనిపించకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ షేర్ చేయకుండా యూజర్ నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్‌పై కేంద్రం దృష్టి సారించింది. ఈ ఫీచర్ ఎంతవరకు ప్రమాదకరమో పరిశీలిస్తోంది. అంటే, కొత్త ఫీచర్ ద్వారా ఏమైనా ఆన్లైన్ మోసాలకు అవకాశం ఉందా, యూజర్ నేమ్‌ల ద్వారా ఇతర యూజర్లకు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది, తప్పుడు సమాచారం చేరవేసేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాల్ని పరిశీలించనుంది.
ఈ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం సమీక్షించిన తర్వాతే దీనికి అనుమతి లభిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుంది. అంటే, ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల మీడియా యాప్‌లలో ఉండే యూజర్ నేమ్లలాగే పని చేస్తుంది. ఇందుకోసం యూజర్లు తమ యూజర్ ఐడీని రిజర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనిపై యూజర్లకు వాట్సాప్ సమాచారం కూడా ఇస్తోంది. ఈ కొత్త ఫీచర్ వల్ల ప్రయోజనాలతోపాటు ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎవరితోనైనా తాత్కాలికంగా చాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్‌తో పని లేకుండా యూజర్ నేమ్ ద్వారానే చాట్ చేయవచ్చు. అయితే, ఇతరులు కూడా అలాగే, చాట్ చేస్తే వారి ఒరిజినల్ నెంబర్ గుర్తించడం కష్టం.
కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇప్పటికే ఉన్న బ్లాక్, అన్నోన్ కాలర్స్ సైలెన్సింగ్ వంటి ఫీచర్లు కొనసాగుతాయి. యూజర్ నేమ్ 3 నుంచి 35 అక్షరాల వరకు ఉండొచ్చు. అలాగే, ఇంగ్లీష్‌లో ఏ టు జడ్ 0-9 వరకు అంకెలు, డాట్, అండర్స్కోర్ మాత్రమే వాడుకోవచ్చు. యూజర్ నేమ్ ఇతరులు యాక్సెస్ చేయాలంటే నాలుగు అంకెలతో ఒక కీ కూడా సెట్ చేసుకోవాలి. కొత్తగా ఎవరితోనైనా చాట్ చేయాలంటే యూజర్ నేమ్‌తోపాటు కీ వర్డ్ కూడా షేర్ చేయాలి.