Vivo | ఆగస్ట్‌లో దేశీ మార్కెట్లో వివో వీ25 గ్రాండ్ ఎంట్రీ
వివో వీ25 ఇండియా లాంఛ్ ఈవెంట్ ఆగస్ట్‌లో జరగనుంది. వివో తన న్యూ అప్పర్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ మూడో వారంలో భారత్‌లో లాంఛ్ చేయనుందని పరిశ్రమ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ : వివో వీ25 ఇండియా లాంఛ్ ఈవెంట్ ఆగస్ట్‌లో జరగనుంది. వివో తన న్యూ అప్పర్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ మూడో వారంలో భారత్‌లో లాంఛ్ చేయనుందని పరిశ్రమ వర్గాల సమాచారం. భారత్‌లో వివో వీ25 సిరీస్‌లో లాంఛ్ అవుతున్న తొల స్మార్ట్‌ఫోన్ వివో వీ25 కావడం గమనార్హం.
వివో వీ25 భారత్‌లో ఆగస్ట్ 17 లేదా 18న లాంఛ్ కావచ్చని భావిస్తున్నారు. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం, సప్లయి చైన్ పరిస్ధితులకు అనుగుణంగా ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. వివో వీ25ప్రొతో పాటు వనిలా వివో వీ25 స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా భారత్‌లో లాంఛ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. వివో వీ25 ప్రొ, వివో వీ25 స్పెషల్ ఎడిషన్ లాంఛ్ తేదీలు ఇంకా వెల్లడి కాలేదు.
సెప్టెంబర్‌లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాయని అంచనా. వివో ఇండియా ప్రతినిధి కంపెనీ ప్రణాళికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక వివో వీ25 6.62 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ప్రీమియం డిజైన్‌తో ఈ స్మార్ట్‌పోన్ ఆకట్టుకోనుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో రానుంది. 66డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

