Realme 9i | స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో భారత్‌లో రియల్మీ 9ఐ లాంచ్.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో రిలీజ్
Realme 9i | రియల్మీ కంపెనీ నుంచి మరో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. గత సంవత్సరం రియల్మీ 8ఐ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది.

కాకపోతే రీఫ్రెష్ రేట్ స్క్రీన్ విషయంలో మాత్రం 8ఐ కంటే 9ఐ మోడల్ ఫోన్‌ది తక్కువ రేట్. రియల్మీ 8ఐ 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో రాగా.. 9ఐ మాత్రం 90 హెచ్‌జెడ్ డిస్ప్లేను కలిగి ఉంది.
రెడ్మీ నోట్ 10 ఎస్, సామ్సంగ్ గెలాక్సీ ఎమ్ 32 ఫోన్లకు పోటీగా రియల్మీ 9ఐ మోడల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులోనే ప్రో మోడల్ ఫోన్ రెడ్ మీ నోట్ 11టీ 5జీ ఫోన్‌కు దీటుగా తీసుకొచ్చారు. ఇందులో రెండు మోడల్స్ అందుబాటులో ఉంటాయి.
4జీబీ ప్లస్ 64 జీబీ, 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్లు ఉంటాయి. 4జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999 కాగా 6జీబీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉండనుంది. ప్రిజమ్ బ్లాక్, ప్రిజమ్ బ్లూ కలర్స్‌లో రానున్న ఈ ఫోన్ సేల్స్ జనవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్లో సేల్స్ ప్రారంభం అవవుతాయి. గత సంవత్సరం రిలీజ్ అయిన రియల్మీ 8ఐ ఫోన్ ధర రూ.13,999గా ఉంది. 6జీబీ వేరయింట్ ధర రూ.15,999గా ఉంది.
రియల్మీ 9ఐ స్పెసిఫికేషన్లు
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11, రియల్మీ యూఐ 2.0, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, డ్రాగన్ ట్రయల్ ప్రో గ్లాస్, ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ, అడ్రెనో 610 జీపీయూ, 50 ఎంపీ ప్రైమరీ సామ్సంగ్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఆక్సిలెరోమీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ డార్ట్ చార్జ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

