Realme 9 Pro | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ నుంచి త్వరలో బెస్ట్ స్మార్ట్ఫో్న్లు రాబోతున్నాయి. రియల్మీ 9 ప్రో, రియల్ మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత్‌లో లాంచ్ కానున్నాయి. ఫిబ్రవరి 16న ఈ ఫోన్లు భారత్‌లో అడుగుపెట్టనున్నాయి. గత కొన్ని నెలల నుంచి రియల్మీ 9 ప్రో ఫోన్ గురించి సోషల్ మీడియలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 1.30 కు వర్చువల్ ఈవెంట్లో ఈ ఫోన్లను కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ఫోన్లను రియల్మీ అదే రోజు రిలీజ్ చేయనుంది.
రియల్మీ 9 ప్రో సిరీస్ ధర భారత్‌లో రూ.15 వేలకు పైనే ఉంటుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ స్పష్టం చేశారు. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, లైట్ షిఫ్ట్ డిజైన్, 50 ఎంపీ సోనీ సెన్సార్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్వోసీ ప్రాసెసర్, 60 వాట్స్ సూపర్‌డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్సీ సపోర్ట్ లాంటి ఫీచర్లు రియల్మీ 9ప్రో ప్లస్‌లో ఉండనున్నాయి.
64 ఎంపీ నైట్స్కేప్ కెమెరా, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ, 120 హెచ్‌జెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, ఎన్ఎఫ్సీ సపోర్ట్, నైట్ షిఫ్ట్ డిజైన్ లాంటి ఫీచర్లతో రియల్మీ 9ప్రో ఫోన్ రానుంది.