OnePlus Watch 2 : మార్కెట్లో నూతన వాచ్‌ను లాంఛ్ చేసేందుకు వన్‌ప్లస్ కసరత్తు సాగిస్తోంది. వన్‌ప్లస్ వాచ్ 2 అధికారిక టీజర్లో వాచ్ డిజైనను వెల్లడిస్తూ ఇట్స్ అబౌట్ టైమ్ అని రాయడం మినహా లాంఛ్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
అయితే వన్‌ప్లస్ వాచ్ 2 స్పెయిన్‌లోని బార్సిలోనా వేదికగా జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 సందర్భంగా లాంఛ్ కానుందని సమాచారం. ఫిబ్రవరి 26న వన్‌ప్లస్ వాచ్ 2 లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు మ్యాక్స్ జంబర్ వెల్లడించారు. తొలుత ఉత్తర అమెరికా, యూరప్, ఇండియాలో వన్‌ప్లస్ వాచ్ 2 అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
లీక్డ్ ఇమేజ్‌ల్లో వన్‌ప్లస్ వాచ్ 2 రౌండ్ డయల్ కలిగిఉంది. ఈ స్మార్ట్‌వాచ్ స్క్రీన్ విషయానికి వస్తే 1.43 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో ఈ హాట్ డివైజ్ ఆకట్టుకుంటుందని అంచనా. వన్‌ప్లస్ వాచ్ 2 స్లీక్ ఫినిష్ కలిగిఉంటుందని లీక్డ్ ఇమేజ్‌ల ద్వారా వెల్లడైంది. స్ట్రాప్ మెటీరియల్ యాపిల్ వాచ్‌లను గుర్తుకుతెచ్చేలా ఉంది. వాచ్ 2 బ్లాక్, లైట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్ కస్టమ్ ఆర్టీఓఎస్ లేదా వియర్ఓఎస్పై రన్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
Read More :
Nothing Phone 2a | మార్చి 5న భారత్ మార్కెట్లోకి మిడ్ రేంజ్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ.. ఇవీ డిటైల్స్..!