Nothing phone (1) | స్నాప్‌డ్రాగన్ 778జీ+ చిప్సెట్తో రానున్న నథింగ్ ఫోన్ 1..ధర ఎంతంటే!
భారత్‌లో ట్రెండీ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 మరో రెండు వారాల్లో లాంఛ్ కానుండగా కంపెనీ ఈ హాట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక ఫీచర్‌ను వెల్లడించింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ట్రెండీ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 మరో రెండు వారాల్లో లాంఛ్ కానుండగా కంపెనీ ఈ హాట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక ఫీచర్‌ను వెల్లడించింది. నథింగ్ ఫోన్ 1 ఆకర్షణీయ డిజైన్‌ను ఇటీవల ప్రదర్శించిన కంపెనీ తాజాగా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకతలను తెలిపింది. ఈ డివైజ్‌లో వాడే చిప్సెట్ గురించి పలు వివరాలు వెల్లడయ్యాయి. నథింగ్ పోన్ 1 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ చిప్సెట్ కలిగిఉందని కంపెనీ సీఈవో కార్ల్ పీ ఇన్పుట్మ్యాగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇది అత్యంత శక్తివంతమైన చిప్ అని దీంతో ఫోన్ మెరుగైన సామర్ధ్యం ప్రదర్శిస్తుందని పీ చెప్పుకొచ్చారు. మధ్యతరహా చిప్‌ను వాడటంతో ఫోన్ ధర కూడా అందుబాటులో ఉండేలా చూశామని అన్నారు. నథింగ్ పోన్ 1 వైర్లెస్, రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉందని కూడా కంపెనీ తెలిపింది. రూ 50,000 కంటే అధిక ధర పలికే స్మార్ట్ఫోన్లలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
గ్లిఫ్ ఇంటర్ఫేస్గా పిలిచే వినూత్న డిజైన్‌తో నథింగ్ పోన్ 1 కస్టమర్ల ముందుకు రానుంది. రియర్ ప్యానెల్ కూల్ లైట్ సిస్టంతో కస్టమైజ్డ్గా అందుబాటులోకి రానుంది. వెనుక భాగంలో లైన్స్ లోపల అమర్చిన 900 ఎల్ఈడీలు ఫోన్‌కు నోటిఫికేషన్స్ రాగానే లైట్లు వెలుగుతూ అలర్ట్ చేస్తాయి. ఇక నథింగ్ పోన్ భారత్‌లో రూ 30,000 నుంచి రూ 40,000 మధ్య లభిస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌పోన్ వంటి పాపులర్ ఫోన్లకు నథింగ్ ఫోన్ 1 దీటైన పోటీ ఇవ్వనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

