“గూగుల్ మీట్” లో సరికొత్త ఫీచర్లు..

బెంగళూరు,జులై 3:కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ గూగుల్ మీట్ ఎంతోబాగా ఉపయోగపడుతున్నది. తమవినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ మీట్ లో మరికొన్ని ఫీచర్లను యాడ్ చేసింది. కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. ప్రస్తుతం గూగుల్ మీట్ ద్వారా ఒకేసారి లక్షమంది సమావేశం కావొచ్చు. గూగుల్ మీట్‌ను హోస్ట్ చేసిన వ్యక్తి మరో కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని సమావేశానికి ఆహ్వానించే సౌకర్యం ఇప్పటిదాకా లేదు. గూగుల్ తాజాగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
లైవ్ స్ట్రీమ్ కొనసాగిస్తూనే,మరోపక్క గూగుల్ మీట్ హోస్ట్ కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని ఈ సమావేశానికి ఆహ్వానించే వెసలుబాటును కల్పించింది. కొత్త ఫీచర్ల వల్ల క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలు ఉంటుంది. ఒక పేజ్ డొమైన్లో లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతోన్న సమయంలో అదే లైవ్ స్ట్రీమింగ్‌ను క్రాస్ డొమైన్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఉంది. దీనితో పాటు క్యాప్షన్స్‌ను కూడా యాడ్ చేసే వీలు ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి, సౌండ్ అలర్జీకి గురయ్యే వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాప్షన్లను యాడ్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది గూగుల్. అలాగే ఆడియో ఆఫ్ చేసిన తరువాత కూడా ఆ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి క్యాప్షన్ల సౌకర్యం దోహదపడుతుందని గూగుల్ యాజమాన్యం తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

