న్యూఢిల్లీ : బీఐఎస్ వెబ్సైట్లో మోటో జీ13 ప్రత్యక్షం కావడంతో ఈ బడ్జెట్ ఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు మొటొరొలా ముమ్మర కసరత్తు సాగిస్తోందని వెల్లడైంది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ 20డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుందని స్పష్టమైంది.
మొటొరొలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌తో అమోల్డ్ ప్యానెల్‌తో ఆకట్టుకోనుంది. మీడియాటెక్ హెలియో జీ99 ప్రాసెసర్ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 732జీ చిప్సెట్తో మోటో జీ13 కస్టమర్ల ముందుకు రానుంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రానుందని భావిస్తున్న మోటో జీ13 ఆండ్రాయిడ్ 13 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది.
పలు ఫీచర్లతో రానున్న మోటో జీ15 భారత్‌లో రూ . 15,000లోపు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది జనవరిలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు.