Apple co founder | స్ట్రోక్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన యాపిల్ సహ వ్యవస్ధాపకుడు
యాపిల్ సహ వ్యవస్థాపకుడు (Apple co founder) స్టీవ్ వోజ్నియాక్ స్ట్రోక్‌తో బాధపడుతూ మెక్సికో సిటీలోని ఆసుపత్రిలో చేరారు. 73 ఏండ్ల టెక్ దిగ్గజం బుధవారం శాంటా ఫె జిల్లాలో వరల్డ్ బిజినెస్ ఫోరం ఈవెంట్‌కు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ : యాపిల్ సహ వ్యవస్థాపకుడు (Apple co founder) స్టీవ్ వోజ్నియాక్ స్ట్రోక్‌తో బాధపడుతూ మెక్సికో సిటీలోని ఆసుపత్రిలో చేరారు. 73 ఏండ్ల టెక్ దిగ్గజం బుధవారం శాంటా ఫె జిల్లాలో వరల్డ్ బిజినెస్ ఫోరం ఈవెంట్‌కు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. వోజ్నియాక్ 1976లో స్టీవ్ జాబ్స్‌తో కలిసి యాపిల్‌ను నెలకొల్పారు. వీరిద్దరూ పర్సనల్ కంప్యూటర్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతో యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆవిర్భవించింది.
సాంకేతికాంశాలపై వోజ్నియాక్‌కు గట్టి పట్టు ఉండటంతో యాపిల్ నుంచి వినూత్న డిజైన్లతో కూడిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, మన్నికైన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఐకానిక్ ఐఫోన్ వంటి హాట్ డివైజ్‌లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. 1950లో కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌జోస్‌లో జన్మించిన వోజ్నియాక్ బాల్యం నుంచే ఎలక్ట్రానిక్స్‌పై ఇష్టం పెంచుకున్నారు. ఆయన తన తొలి కంప్యూటర్ను 11 ఏంండ్ల వయసులోనే తయారుచేశాడు. ఆపై 1975లో బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1975లో స్టీవ్ జాబ్స్‌తో కలిసి వోజ్నియాక్ తన పేరెంట్స్‌కు చెందిన గ్యారేజ్‌లో యాపిల్ కంప్యూటర్ సంస్ధను ఆరంభించాడు. తొలి కమర్షియల్ పర్సనల్ కంప్యూటర్లు యాపిల్ 1, యాపిల్ 2ను వోజ్నియాక్ డిజైన్ చేశాడు. ఇక 1987లో యాపిల్ నుంచి బయటకు వచ్చిన వోజ్నియాక్ ఎడ్యుకేషనల్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి విక్రయించే వీల్స్ ఆఫ్ జ్యూస్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. కంప్యూటర్ పరిశ్రమకు వోజ్నియాక్ చేసిన సేవలకు గాను నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ట్యూరింగ్ అవార్డ్ వంటి ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్, కాలిఫోర్నియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో వోజ్నియాక్ సభ్యుడిగా ఉన్నారు.
Read More :
Aditya L1 | ఆదిత్య ఎల్1 మిషన్‌లో ఎక్స్-రేలో సౌరజ్వాల.. ఇస్రో ట్వీట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

